Begin typing your search above and press return to search.
అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్ ఇలా చేయొచ్చట
By: Tupaki Desk | 19 Oct 2016 10:30 PM GMTప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికాకు ఉన్నంత సాంకేతిక హంగులు మరే దేశానికి ఉండవంటే అతిశయోక్తి కాదు. మరి.. అలాంటి దేశానికి అధ్యక్ష స్థానంలో కూర్చునే వ్యక్తిని డిసైడ్ చేసే అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ సాధ్యమేనా? అన్న డౌట్ కలలో కూడా రాని పరిస్థితి. అయితే.. అలాంటి విషయం చాలా సింపుల్ అని.. అది కూడా కేవలం వెయ్యి రూపాయిల ఖర్చుతోనే చేసేయొచ్చన్న ఒక టెక్నాలజీ కంపెనీ మాట ఇప్పుడు సంచలనంగా మారింది.
సిమాన్ టెక్ అనే సంస్థ చెబుతున్న మాట ఇప్పుడు పెనుసంచలనంగా మారటమే కాదు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాల్ని చాలా సింపుల్ గా మార్చేయొచ్చన్న భావన కలిగేలా చేయటం గమనార్హం. ఇంతకీ ఆ కంపెనీ చెబుతున్న రిగ్గింగ్ ఎలా సాధ్యమన్న సాంకేతిక అంశాన్ని సింపుల్ మాటల్లో చెబితే.. అమెరికాలోని ఓటర్లు తమ ఓటు వేసేందుకు ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు మనం వాడే క్రెడిట్.. డెబిట్ కార్డులకు ఉన్నట్లుగా చిప్ ఉంటుంది. ఈ చిప్ లో వినియోగించిన ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టం) అవుట్ డేటెడ్ కావటం.. చిప్ కార్డులో రాసిన ప్రోగ్రాంను ఒక పౌడరు డబ్బా కొన్నంత తేలిగ్గా.. చౌకగా మార్కెట్లో దొరుకుతుందని.. ఆ ప్రోగ్రాంను కార్డుతో రీసెట్ చేస్తే రెండుసార్లు ఏంటి.. ఎన్నిసార్లు అయినా ఓటు వేసే వీలు ఉంటుందని చెబుతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపయోగించే ఓటింగ్ యంత్రాలకు పోలినట్లే ఉండే.. డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ యంత్రాల్ని పరిశీలించిన కంపెనీ.. చిప్ కార్డు ఓఎస్ ను మార్చేసే వీలుందని తేల్చింది. ఓటర్ల సమాచారం మొత్తాన్ని పెన్ డ్రైవ్ లాంటి స్టోరేజి డివైజ్ లో ఎలాంటి ఎన్క్రిప్షన్ లేకుండా టెక్ట్స్ రూపంలో ఉందని.. అన్ని ఓటింగ్ పాయింట్లలో సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ ఉంచటం ద్వారా రిగ్గింగ్ సాధ్యమని పేర్కొంది. అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్ మరీ ఇంత సులువా? అన్నద ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. మరి.. దీనికి అమెరికా ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/