Begin typing your search above and press return to search.

జాక్ స్ట్రా బ్రా ఎలా పుట్టింది..? దానిని వేసుకోవడం ఎప్పుడు ప్రారంభించారు..?

By:  Tupaki Desk   |   23 May 2022 4:55 AM GMT
జాక్ స్ట్రా బ్రా ఎలా పుట్టింది..? దానిని వేసుకోవడం ఎప్పుడు ప్రారంభించారు..?
X
ఆటల పోటీల్లో మహిళా క్రీడాకారిణులు ధరించే దుస్తులను ఎవరైనా గమనించారా..? టాప్ లో అచ్చం బ్రా వలె జాకెట్ ఉంటుంది.. బాటమ్ లో షార్ట్ వేసుకొని కనిపిస్తారు. అయితే ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరికే ఈ డ్రెస్సింగ్ ఎలా పుట్టింది..? అనే విషయాన్ని చాలా మంది పట్టించుకోరు.

కానీ మహిళలు దీనిని వేసుకోవడానికి పూర్వం ఓ పెద్ద కథే సాగింది. మహిళా క్రీడామణులు వేసుకునే దీనిని జాక్ ఫ్రా బ్రా అని అంటారు. క్రీడాపోటీల్లో పాల్గొనే మహిళలు దీనిని ధరించడం వల్ల ఎంతో సౌకర్యంగా ఫీలవుతారు. అయితే డ్రెస్సింగ్ వేసుకోవడానికి 1970లో ప్రారంభించారు. ఇద్దరు మహిళలకు కలిగిన అసౌకర్యంతో దీనిని తయారు చేశారు.

1977లో వెర్మోంట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి లిసా లిండాల్ కు రన్నింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. దీంతో ఆమె ప్రతీవారం వరకు 30 మైళ్లు పరుగెత్తేవారు. అయితే రన్నింగ్ చేసే సమయంలో ఆమె ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనేది. వక్షోజాలకు సరైన సపోర్టు లేకపోవడంతో అసౌకర్యంగా ఫీలయ్యేది. దీంతో ఆమె మాములు బ్రా వేసుకోవడం ప్రారంభించారు. అయినా కంపోర్టు లేకపోవడంతో దీని గురించి ఆలోచించడం ప్రారంభించింది. అయితే అప్పటికే జాక్ స్ట్రాప్ ను మగవాళ్ల ప్రైవేట్ పార్ట్స్ ను కాపాడడానికి తయారు చేశారు. క్రీడల్లో పాల్గొనే పురుషులు దీనిని ధరించేవారు.

దీంతో మహిళల కోసం కూడా ప్రత్యేకంగా తయారు చేయొచ్చుగా అని లిసా లిండాల్ అనుకున్నది. దీతో తన బెస్ట్ ఫ్రెండ్ పాలీ పామర్ స్మిత్ కు ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. దీంతో లిసా, ఆమె చెల్లితో పాటు ఫ్రెండ్ ముగ్గురూ కలిసి లిసా వాళ్ల ఇంట్లో ప్రయోగాలు మొదలుపెట్టేవారు.

ఆ తరువాత లిసా చెల్లి హిండా మిల్లర్ కొన్ని నమునాలను తయారు చేసింది. వాటిని లిసా ధరించి టెస్ట్ చేసింది. అయితే అది సక్సస్ కాలేదు. తరువాత లిసా భర్త జాక్ స్ట్రాప్ తన చాతి మీదకు లాక్కొని మెట్లు దిగుతుండడాన్ని గమనించింది. ఆయనను చూడగానే లిసాకు కొత్త ఆలోచన వచ్చింది. వెంటనే రెండు జాక్ స్ట్రాప్ లు కలిసి కుట్టారు. అలా జాక్ స్ట్రాప్ బ్రా ఏర్పడింది.

ఆ తరువాత జాగ్ బ్రా అనే సంస్థను ప్రారంభించి పెటెంట్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ తరుణంలో అమెరికాలోని ‘నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్’ లో వీరి ఆవిష్కరణకు అవకాశం దక్కింది. ఆ తరువాత మహిళా అథ్లెట్లకు ఇవి సౌకర్యంగా మారాయి. ఈ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి వారివద్ద తగినంత డబ్బు లేదు.

దీంతో లిసా, హిండా మోడల్స్ గా మారారు. ‘నో మ్యాన్ -మేడ్ స్పోర్టింగ్ బ్రా కెన్ టచ్ ఇట్’ అనే క్యాప్షన్ ఇచ్చి ప్రచారం చేశారు. ఆ తరువాత మాకు ఫోన్ కాల్స్ విపరీతంగా వచ్చాయని లిసా చెప్పారు. ప్రస్తుతం ఈ సంస్థ రూ.70.036 కోట్ల ఉత్పత్తులను చేస్తోంది. అథ్లీజర్ మార్కెట్ కూడా రూ.1,94, 546 కోట్ల మార్కెట్ విలువతో అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి సౌకర్యవంతమైన జాక్ స్ట్రా బ్రాలతో మహిళలు పరుగుపందెల్లో పాల్గొంటున్నారు.