Begin typing your search above and press return to search.

‘వైట్ ఫంగస్’ ఇన్ఫెక్షన్లు ఎలా వ్యాపిస్తున్నాయి?

By:  Tupaki Desk   |   3 Jun 2021 1:30 AM GMT
‘వైట్ ఫంగస్’ ఇన్ఫెక్షన్లు ఎలా వ్యాపిస్తున్నాయి?
X
భారత్ లో సెకండ్ వేవ్ విజృంభణతో తీవ్రమైన లక్షణాలతో ఐసీయూల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో వీటితోపాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువయ్యాయి. మొదట అరుదైన, ప్రాణాంతక ఇన్ఫెక్షన్ మ్యూకరో మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూశాయి. ముక్కు, కళ్లు, మెదడుపై ఈ ఇన్ఫెక్షన్ ప్రభావం చూపిస్తోంది. దేశంలో ఇన్ఫెక్షన్ కేసులు దాదాపు 12000 నమోదయ్యాయి. మరణాలు కూడా 200కు పైగానే సంభవించాయి.

ఇప్పుడు కొత్తగా కోవిడ్19 రోగుల్లో మరో ప్రాణాంతక ఇన్ఫెక్షన్ సోకుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఐసీయూల్లో వారం కంటే ఎక్కువ రోజులు ఉన్న వారిలో 200కు పైగానే సంభవించాయి.

కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు కోవిడ్19 లక్షణాలుగానే ఉంటాయి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు తదితర ఇబ్బందులు తలెత్తాయి. ఈ వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్లలో గోర్లు, ముక్కు, నోరు, ఊపిరితిత్తుల నుంచి తెల్లని చీము బయటకు వస్తుంటుంది. అందుకే ఈ ఫంగస్ ను 'వైట్ ఫంగస్' అని కూడా పిలుస్తారు. రక్తంలోకి ఫంగస్ ప్రవేశిస్తే రక్తపోటు, జ్వరం, కడుపునొప్పి , మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకుతాయి.

వెంటిలేటర్ పై ఉండే రోగుల్లో ఎక్కువగా బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్19తో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు కిక్కిరిసిపోవడంతో ప్రస్తుతం ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఇన్ఫెక్షన్లను నిర్ధారించడం కూడా కష్టమే. దీనికోసం మొదట ఊపిరితిత్తుల్లో నుంచి నమూనాలను సేకరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఔషధాలు కూడా ఖరీదు ఎక్కువే. కాబట్టి చికిత్స అందించడం చాలా ఆందోళనకరంగా ఉంటుంది. ఆ రోగుల ఊపిరితిత్తులను కోవిడ్ దెబ్బతీస్తుంది. అందుకే ఈ ఫంగస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.