Begin typing your search above and press return to search.
బీజేపీని గ్రేటర్ మేయర్ ఎలా డీల్ చేయనున్నారు?
By: Tupaki Desk | 13 Feb 2021 8:30 AM GMTగ్రేటర్ మేయర్ గా ప్రమాణస్వీకారం చేసిన గద్వాల విజయలక్ష్మి.. పదవీ బాధ్యతల్ని మాత్రం స్వీకరించలేదు. అమావాస్య రోజున ప్రమాణ స్వీకారం చేయటంతో.. పదవీ బాధ్యతల్ని స్వీకరించేందుకు ‘మంచిరోజు’ కోసం ప్లాన్ చేస్తున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో గ్రేటర్ మేయర్ గా వ్యవహరించిన బొంతు రామ్మోహన్ కు లేని ఇబ్బంది తాజా మేయర్ కు బీజేపీ రూపంలో ఎదురుకానుంది. గతంలో టీఆర్ఎస్.. మజ్లిస్ నేతలే 95 శాతం ఉండటంతో పాలనా రథాన్ని నడపటంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.
ఈసారి అందుకు భిన్నంగా బీజేపీ కార్పొరేటర్లు 47 మంది ఉండటం గద్వాల విజయలక్ష్మికి ఇప్పుడో టాస్కుగా మారింది. వారిని డీల్ చేయటం అంత తేలికైన విషయం కాదన్నది తెలిసిందే. తెలంగాణలో పాగా వేయాలని భావిస్తున్న కమలనాథులు.. బలమైన విపక్షంగా టీఆర్ఎస్ కు సవాలు విసిరే వీలుంది. వారికున్న మార్గం.. హైదరాబాదే. కౌన్సిల్ సమావేశంలోనూ.. హైదరాబాద్ డెవలప్ మెంట్ మీద వారు తరచూ గళం విప్పే అవకాశం ఉంది. దీంతో.. వారు విసిరే సవాళ్లను అధిగమిస్తూ.. ముందుకు వెళ్లటం అంత తేలికైన విషయం కాదు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత అటు అసెంబ్లీలో కానీ.. ఇటు స్థానిక సంస్థల్లో కానీ ఈ స్థాయిలో బలమైన ప్రతిపక్షం ఉన్నది లేదు. తొలిసారి గ్రేటర్ లో అధికార టీఆర్ఎస్ కు అగ్నిపరీక్షగా మారనుంది. మరి.. బీజేపీ కార్పొరేటర్లను డీల్ చేయటానికి గద్వాల విజయలక్ష్మి వద్ద ఉన్న వ్యూహం ఏమిటి?ఆమె ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముందు వరకు మాత్రమే రాజకీయాలు కానీ.. తర్వాత అందరం కలిసి డెవలప్ మెంట్ కోసం కలిసిమెలిసి పని చేయాలన్నదే తన ఆలోచనగా విజయలక్ష్మి చెబుతున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల కార్పొరేటర్లతో కలిసి పని చేయనున్నట్లు చెప్పిన ఆమె మాటలంత తేలిగ్గా.. వాస్తవం ఉండదంటున్నారు. తన మాటలతో పాజిటివ్ మెసేజ్ పంపుతున్న వేళ.. కమలనాథులు ఇందుకు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా చెప్పాలి.