Begin typing your search above and press return to search.
`పాన్ `లతో పటిష్ట వారధికి పెను ముప్పు!
By: Tupaki Desk | 8 Feb 2018 2:30 PM GMT`యమహా నగరి కలకత్తా పురి.....నమహో హుగిలీ హౌరా వారధి.....చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది....`ఓ తెలుగు సినీకవి రాసిన ఈ పాట బాగా పాపులర్. ఆ కవి వర్ణించినట్లుగానే కలకత్తాకే మణిమకుటం వంటి హౌరా బ్రిడ్జికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కోల్ కతాకే తలమానికిమైన ఈ బ్రిడ్జి నిర్మాణం ఈ ఏడాది వజ్రోత్సవాలు జరుపుకుంటోంది. దేశానికే గర్వకారణమైన హౌరా బ్రిడ్జ్ ను....సముద్ర తుఫానులు - వెయ్యి టన్నుల ఓడలు కూడా టచ్ చేయలేకపోయాయి. 75 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఈ పటిష్టమైన వంతెన `పాన్` ధాటికి వణికిపోతోంది. ప్రపంచంలోని ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటైన హౌరా బ్రిడ్జ్ కు గుట్కాలు - పాన్ ల వల్ల పెను ప్రమాదం ఏర్పడనుంది.
హౌరాబ్రిడ్జ్ పై ప్రయాణిస్తున్న పాదచారులు - ప్రజలు...గుట్కాలు - కిళ్లీలు తిని ఆ బ్రిడ్జిపై ఉన్న హ్యాంగర్లు - ఐరన్ పిల్లర్లపై ఉమ్మివేస్తున్నారు. దీంతో, ఆ వంతెన రోజురోజుకీ బలహీనపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ చారిత్రక వంతెనపై పాన్ - గుట్కాలు ఉమ్మినప్పుడు రసాయన చర్య జరగడంతో స్టీలు బలమీనపడుతుందని అంటున్నారు. స్టీల్ మీద నికొటినమైట్ పడటంతో యాసిడ్ సామర్థ్యం పెరిగి లోహం బలహీనంగా మారుతుందని చెబుతున్నారు. గుట్కా - పాన్ ల మరకలు వంతెన బలహీనపడడానికి స్లో పాయిజన్ లా పని చేస్తున్నాయని కోల్ కతాకు చెందిన రసాయనశాస్త్ర నిపుణులు మహ్మద్ షాహ్ ఆలమ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, పాదచారులు పాన్ - గుట్కాలు నమిలి ఉమ్మి వేయవద్దని వంతెనపై అనేకచోట్ల బెంగాల్ ప్రభుత్వం బోర్డులు పెట్టింది. అయినప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదు. దీంతోపాటు - పక్షుల రెట్టల వల్ల కూడా బ్రిడ్జ్ బలహీనపడుతుందని ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బ్రిడ్జి పూర్తిగా బలహీన పడుతుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.
హౌరా బ్రిడ్జికి చారిత్రక నేపథ్యం ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం 1936లో ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమవగా 1943 - ఫిబ్రవరి 3న బ్రిడ్జి పై రాకపోకలు ప్రారంభమయ్యాయి. హౌరా బ్రిడ్జ్ నిర్మాణానికి 26,500 టన్నుల స్టీల్ ఉపయోగిస్తే....దానిలో 23,500 టన్నుల స్టీల్ ను టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ సరఫరా చేసింది. కోల్ కతా-హౌరాలను కలుపుతున్న ఈ బ్రిడ్జిపై రోజూ లక్షకుపైగా వాహనాలు - లక్షన్నర మంది పాదచారుల రాకపోకలు కొనసాగిస్తున్నారు. కోల్ కతా ప్రజలంతా ఈ చారిత్రక బ్రిడ్జి నిర్మాణంలో తమవంతు సాయమందించారు. హౌరాబ్రిడ్జ్ పై చాలా సినిమాలను షూట్ చేశారు. అయితే, మానవుల నిర్లక్ష్యం వల్ల ఆ బ్రిడ్జి ఉనికి భవిష్యత్తులో ప్రశ్నార్థకమయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.