Begin typing your search above and press return to search.
జగన్ హ్యాపీ..కర్నూలులోనే హెచ్ఆర్సీ ఆఫీసు!
By: Tupaki Desk | 27 Aug 2021 4:30 AM GMTమానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటుకు అడ్డంకులు దాదాపు తొలగిపోయినట్లే. ప్రస్తుతం హెచ్ఆర్సీ కార్యాలయం హైదరాబాద్ లో ఉంది. ఏ విషయంలో అయినా ఫిర్యాదు చేయాలంటే ఫిర్యాదుదారులకు ఇబ్బందిగా ఉంటోంది. ఒక రాష్ట్రానికి చెందిన హెచ్ఆర్సీ కార్యాలయం మరో రాష్ట్రంలో ఉండటంపై రాష్ట్ర హైకోర్టు కూడా తీవ్రంగా మండిపడింది. వెంటనే హైదరాబాద్ నుండి కార్యాలయాన్ని ఖాళీ చేసి ఏపీ పరిధిలో ఎక్కడైనా వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు హెచ్ఆర్సీ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం కర్నూలును డిసైడ్ చేసింది. హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యులకే కార్యాలయం భవనాన్ని ఎంచుకునే బాధ్యతను ప్రభుత్వం పెట్టింది. దాంతో చైర్మన్, సభ్యులు కర్నూలులో తిరిగి తమ కార్యాలయం ఏర్పాటుకు అనువుగా ఉన్న భవనాల కోసం వెతుకుతున్నారు. దీన్ని కొందరు అభ్యంతరం చెప్పారు. హైకోర్టు ఎక్కడుంటే హెచ్ఆర్సీ కార్యాలయం కూడా అక్కడే ఉండాలన్నారు.
కర్నూలులో హెచ్ఆర్సీ కార్యాలయం ఏర్పాటు చేస్తే మిగిలిన రాష్ట్రానికి అది చాలా దూరంగా ఉంటుందనే విచిత్రమైన వాదన వినిపించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హెచ్ఆర్సీ కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేసినందువల్ల మిగిలిన ప్రాంతాలకు దూరమవుతుందని పిటిషనర్ వాదన నిజమే అనుకుందాం. మరి అదే పద్ధతిలో హెచ్ఆర్సీ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తే అప్పుడు కూడా మిగిలిన ప్రాంతాలకు దూరమవుతుంది కదా.
ఇక్కడ విషయం ఏమిటంటే లాజిక్ లేని వాదనలతో, పిటీషన్లతో కర్నూలులో హెచ్ఆర్సీ కార్యాలయాన్ని అడ్డుకోవాలన్నదే పిటిషనర్ టార్గెట్ గా కనబడుతోంది. దీన్నే హైకోర్టు తప్పుపట్టింది. హెచ్ఆర్సీ కార్యాలయం రాష్ట్రంలో ఏర్పాటు చేయమన్నాం కానీ పలానా చోటే ఏర్పాటు చేయాలని చెప్పలేదన్నారు. హెచ్ఆర్సీ కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమన్నారు. హైకోర్టు ఉన్న ప్రాంతంలోనే హెచ్ఆర్సీ కార్యాలయం ఉండాలని ఏమీ లేదని స్పష్టం చేసిన కోర్టు కేసును నెల రోజులు వాయిదా వేసింది.
కర్నూలులోనే హెచ్ఆర్సీ కార్యాలయం ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యాలయాలు కూడా కర్నూలులోనే ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగానే తొందరలోనే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు చాలామంది కోర్టులో కేసులు వేశారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.