Begin typing your search above and press return to search.
'గుండీలు' తీసిన బంట్లు.. నయా కేటుగాళ్లు..!
By: Tupaki Desk | 7 Jan 2023 11:30 AM GMT'గుండెలు తీసిన బంటు' అనే సామెత వినే ఉంటారు. ఈ సామెతను నమ్మించి మోసం చేసే వారి విషయంలో ఎక్కువగా వాడుతారు. అయితే కొందరు కేటుగాళ్లు మాత్రం 'గుండీలు' తీసిన బంట్లుగా మారుతున్నారు. అదేంటీ అనుకుంటున్నారా? మీరు విన్నది కరెక్టే..! ముంబాయి ఎయిర్ పోర్టులో తాజాగా వెలుగు చూసిన ఘటన చూస్తే మీరు కూడా ఇలానే అంటారు.
కొందరు స్మగ్లర్లు పోలీస్.. కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా నయా ప్లాన్ వేస్తున్నారు. మాదకద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా కస్టమర్లకు చేరుస్తున్నారు. అయితే ఇలాంటి కేటుగాళ్లను పోలీసులు సైతం అంతే చాకచక్యం పట్టుకొని కటకటాల వెనక్కి పంపిస్తుండటం గమనార్హం. తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో సినిమాను తలదన్నే సీన్ చోటు చేసుకుంది.
ఇద్దరు వ్యక్తులు కస్టమ్ అధికారులను బురడీ కొట్టించి కొకెయిన్.. హెరాయిన్ మాదకద్రవ్యాలను రవాణా చేస్తూ దొరికిపోయారు. వీటి విలువ సుమారు రూ. 47 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ సంఘటనకు పూర్తి వివరాల్లోకి వెళితే.. కస్టమ్స్ అధికారులు ఎప్పటిలాగే ముంబై ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. వీరిలో ఇథియోపియా ఎయిర్ లైన్స్ నుంచి దిగిన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కన్పించాడు.
అతడి బ్యాగును తీసుకొని చెక్ చేయగా అందులోని అన్ని చొక్కా గుండీలు ఉన్నాయి. వాటిని పరిశీలించి చూస్తే సదరు గుండెల్లో 1.596 కిలోల కొకెయిన్ బయటపడింది.
వీటి విలువ సుమారు 16 కోట్లు ఉంటుందని అంచనా. ఇటువంటి తరహాలోనే మరొక వ్యక్తి కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.
జోహన్నెస్ బర్గ్ నుంచి నైరోబీ మీదుగా కెన్యా ఎయిర్ వేస్ లో వచ్చిన వ్యక్తి తన హ్యండ్ బ్యాగ్ లో నల్లటి ఫోల్డర్ లో దాచిన 4.47 కిలోల హెరాయిన్ ను కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 31 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఇద్దరు నిందితులను కస్టమ్స్ అధికారులు ఆధీనంలోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.