Begin typing your search above and press return to search.

భూమి వైపు భారీ గ్రహశకలం.. ఇక అంతా అంతం..!

By:  Tupaki Desk   |   14 Aug 2021 4:30 PM GMT
భూమి వైపు భారీ గ్రహశకలం.. ఇక అంతా అంతం..!
X
ఇప్పటికే ఎంతో మంది పరిశోధకులు, శాస్త్రవేత్తలు భూమి అంతం గురించి పలు థియరీస్ ప్రపోజ్ చేశారు. ఇక భూమి త్వరలోనే అంతం కాబోతున్నదని పలు ఆధారాలు కూడా చూపించారు. కానీ, అలాంటివి ఏవీ జరగలేదు. కాగా, తాజాగా అలాంటి వార్త ఒకటి మళ్లీ తెరపైకి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' ఈ విషయం గురించి తెలిపింది. భూమి వైపునకు ఓ భారీ ఆస్టరాయిడ్ దూసుకొస్తుందని, అది భూమిని రీచ్ అయితే ఇక అంతా అంతం అయిపోతుందని 'నాసా' శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వారి వివరాల ప్రకారం..ఎర్త్‌ను ఓ భారీ గ్రహశకలం ఢీకొట్టనుంది. దాదాపు 500 మీటర్ల డయామీటర్ కలిగిన బెన్ను అనే ఓ భారీ శకలం మరికొన్నేళ్లలో ఎర్త్‌ను కచ్చితంగా ఢీకొంటుందని 'నాసా' చెప్తోంది. ఈ గ్రహశకలం ప్రతీ 436.604 రోజులకు ఒకసారి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోందని, అలానే ప్రతీ ఆరేళ్లకు భూమికి చేరువగా సమీపిస్తోందని పేర్కొంటున్నారు నాసా పరిశోధకులు.

ఈ క్రమంలోనే 2,300లో ఈ 'బెన్ను' గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా వివరించింది. 'బెన్ను' ఆస్టరాయిడ్ కదలికలపై ఐదేళ్లుగా 'నాసా' కంటిన్యుయస్‌ గా రీసెర్చ్ చేస్తోంది. అందులో భాగంగానే బెన్నుపై మరింత పరిశోధనలు జరిపేందుకు 2016లో ఒసైరిస్-రెక్స్ అనే వ్యోమనౌకను ప్రయోగించింది. నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2020 అక్టోబర్‌ 21న ఒసైరిస్-రెక్స్ విజయవంతంగా 'బెన్ను' ఆస్టరాయిడ్‌పై ల్యాండ్ అయింది. ఇక అప్పటి నుంచి ఆ గ్రహశకలంపై ఉన్న పలు నమూనాలను సేకరించారు పరిశోధకులు.

వాటి ద్వారా దాని కదలికల్ని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2,300 సంవత్సరంలో ఈ గ్రహశకలం భూమిని తప్పక ఢీకొంటుందని పేర్కొంటున్నారు. కాగా ప్రస్తుతం 'బెన్ను' గ్రహశకలం ఎర్త్‌కు సుమారు 29.3 కోట్ల కి.మీ. దూరంలో ఉందని చెప్పతున్నారు. ఈ దూరం భూమికి అంగారకుడికి మధ్య ఉన్న దూరంతో సమానమని 'నాసా' శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. గ్రహశకలం నుంచి 'ఒసైరిస్ రెక్స్' సేకరించిన నమూనాల వివరాలు 2023 నాటికి భూమికి చేరుకుంటాయని, అప్పుడు మరింత స్పష్టంగా సమాచారం తెలుస్తుందని మరికొందరు పరిశోధకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మరికొంత మంది శాస్త్రవేత్తలు 'బెన్ను' గ్రహశకలం కంటే ముందరే మానవాళిని తుడిచిపెట్టేసే మరో గ్రహశకలం 'అపోఫిస్' భూమి వైపుగా దూసుకొస్తోందని హెచ్చరిస్తున్నారు. ఏది నిజమవుతుందో కాలమే వెల్లడించనుంది. అయితే, ఇలాంటి భూమి అంతానికి సంబంధించిన వార్తలు, స్టోరీలు వేల కొలది చదివి ఉన్నారు మానవులు.

ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల పరిశీలనలు, అధ్యయనాలను, ప్రకటనలను కచ్చితంగా నమ్మలేకపోతున్నారు. శాస్త్రీయ అధ్యయనాలు చేసిన తర్వాతనే నమ్మే పరిస్థితులు నేడు నెలకొని ఉన్నాయని చెప్పొచ్చు. ఇక గ్రహశకలాలు గతంలో భూమికి అత్యంత సమీపంగా వచ్చాయి. కానీ, వాటి వల్ల భూమిపైన ఎలాంటి మార్పులు జరగలేదు. ఈ గ్రహశకలాల కదలికలు, గమనంపై వివిధ దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు స్పేస్ వెహికల్స్‌ను పంపించి నమూనాలు సేకరించి, వాటి ఆధారంగా అంచనాలు వేస్తున్నారు. అయితే, శాస్త్రీయ అధ్యయనాలు చేయడం వల్లే పలు విషయాలపై కచ్చితమైన నిర్ధారణ జరగుతుంది.