Begin typing your search above and press return to search.
రోజా గెలుపుపై బెట్టింగులు - ఫ్యాక్టర్స్ ఇవే!
By: Tupaki Desk | 23 April 2019 1:30 PM GMTనగరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే విజయం సాధిస్తుందా? లేదే అనే అంశంపై భారీగా బెట్టింగులు సాగుతూ ఉన్నాయి. గత ఎన్నికల్లో స్వల్పమైన మెజారిటీతో బయటపడ్డారు రోజా. అయితే అప్పుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు వంటి సీనియర్ పొలిటీషియన్ తో తలపడి నెగ్గింది రోజా. అయితే ఈ సారి ఆయన లేరు. ఆయన తనయుడు రోజాపై పోటీ చేశారు.
లెక్క ప్రకారం చూస్తే రోజా విజయం ఈజీనే. అయితే ఐదేళ్లుగా ఆమె ఎమ్మెల్యేగా ఉండటంతో ఆమె నియోజకవర్గానికి అందించిన సేవలు కూడా ఈ సారి ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి.. ఇక్కడ విజయావకాశాలు దోబూచులాడుతున్నాయని భోగట్టా.
ఇక్కడ ఫలితాన్ని మరి కొన్ని అంశాలు కూడా ప్రభావితం చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణానంతరం ఆయన కుటుంబంలో విబేధాలు బయటపడ్డాయి. ముద్దుకృష్ణమ స్థానంలో ఎవరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే అంశంలో కూడా వారు తగాదా పడ్డారు.
ఆయన ఇద్దరు తనయులూ పోటీ పడ్డారు. దీంతో చంద్రబాబు వారిని వారించి.. ముద్దుకృష్ణమ సతీమణికి ఎమ్మెల్సీ పదవిని అప్పగించారు. ఇక ఎమ్మెల్యే టికెట్ విషయంలో కూడా వారి రచ్చ జరిగింది.
తీరా చంద్రబాబు నాయుడు అందరినీ రాజీ చేసి.. ఒకరికి టికెట్ ఇచ్చినా లోలోన మాత్రం వారు సహకరించలేదని టాక్. ఇలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కుటుంబంలోనే విబేధాలు తీవ్ర స్థాయిలో కనిపించడంతో పార్టీ అక్కడే వెనుకబడిపోయిందని అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కి బలమైన క్యాడర్ ఉండటంతో అక్కడ ఆ పార్టీ విజయం మీద ఆశలు పెట్టుకుంది.
ఇక రోజా భర్త సెల్వమణి సామాజికవర్గం ప్రజలు కూడా ఈ నియోజకవర్గం పరిధిలో గట్టిగా ఉన్నారు. అది ఆమెకు మరో సానుకూల అంశంగా మారుతోంది. మొత్తానికి నగరిలో టైట్ ఫైట్ నడిచిందని స్పష్టం అవుతోంది. దీంతో బెట్టింగులు కూడా భారీగా జరుగుతున్నాయి. ఎవరి లెక్కలు నిజమై.. ఎవరు గెలుస్తారో.. ఎవరు బెట్టింగుల మొత్తాలను పొందుతారో.. ఫలితాలు వస్తే కానీ తెలియదు!