Begin typing your search above and press return to search.
ఈ రెండు సీట్లపై కోట్లలో బెట్టింగ్
By: Tupaki Desk | 13 April 2019 8:25 AM GMTఎన్నికల ప్రక్రియ ముగిసింది. అభ్యర్థులందరూ ఓట్ల సరళిపై లెక్కలు వేసుకుంటున్నారు. పోలింగ్ పూర్తవ్వడంతో ఇక ఫలితానికి 40 రోజుల సమయం ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. పరిచయం ఉన్న వాళ్లందరికీ ఫోన్లు చేస్తున్నారు. ఓటింగ్ సరళిపై ఆరాతీస్తూ పందాలు కాస్తున్నారు.
ఏపీలో ఈసారి టఫ్ ఫైట్ నెలకొంది. రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది.? నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు, మెజారిటీ, జిల్లాలో ఎన్ని సీట్లు ఏయే పార్టీకి వస్తాయి అనే కేటగిరిల్లో బెట్టింగ్ లు కాస్తున్నారు. ఏకంగా బుకీలు కూడా రంగంలోకి దిగారు. రూ.25వేల నుంచి మొదలుకొని రూ.25లక్షల వరకు పందాలు కాస్తున్నారు. ఏపీలో ముఖ్యంగా 16 హాట్ సీట్లపై జోరుగా పందాలు కాస్తున్నట్టు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో జోరుగా పందాలు కాశారు. 200 కోట్ల వరకు బెట్టింగ్ లు జరిగాయి. ఈసారి మాత్రం ఏపీలో ఉత్కంఠ పోరు సాగడంతో బెట్టింగ్ లు భారీగా సాగుతున్నాయి.
ముఖ్యంగా ఏపీలోని రెండు నియోజకవర్గాలపై అత్యధిక బెట్టింగ్ సాగుతోంది. అందులో ఒకటి మైలవరం కాగా.. రెండోది గుడివాడ.. ఈ రెండు కృష్ణా జిల్లాలోని బలమైన నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాలు. ఇక్కడ బిగ్ ఫైట్ సాగుతో్ంది. మైలవరంలో దేవినేని ఉమ వర్సెస్ వసంత కాగా.. గుడివాడలో నాని వర్సెస్ దేవినేని అవినాష్ పోరు హోరాహోరీగా ఉంది. ఉద్దండులైన వీరిలో ఎవరిదో గెలుపు అంచనా వేయలేకపోతున్నారు. అందుకే బెట్టింగ్ రాయుళ్లు ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాలపై పందాలను కాస్తున్నారు. అభ్యర్థుల గెలుపు, మెజారిటీపై కోటిన్నరకు పైగా పందాలు కాస్తున్నట్టు సమాచారం. పోటీ ఆంధ్రాలో జరిగినా తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగానే బెట్టింగ్ రాయుళ్లు ఈ భారీ పందాలు కాస్తున్నట్టు సమాచారం.