Begin typing your search above and press return to search.
భాగ్యనగరంలో భారీ భవంతి.. ? ఎక్కడంటే..!
By: Tupaki Desk | 7 Feb 2021 1:30 AM GMTహైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతున్నది. అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ కొలువు దీరాయి. దేశంలోనే అతి పెద్ద ఐటీహబ్‌గా అవతరించేందుకు హైదరాబాద్ పరుగులు తీస్తున్నది. ఈ క్రమంలో అనేక నిర్మాణాలు హైదరాబాద్‌కు మరింత శోభను తీసుకొస్తున్నాయి. ఇప్పడు హైదరాబాద్‌లో అతి పెద్ద నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నానక్‌రాం గూడలో దాదాపు 44 అంతస్తుల భవనాన్ని నిర్మించబోతున్నారు.
దీనికోసం జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు కూడా ఇచ్చేశారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఇదే అత్యంత ఎత్తైన భవంతి అని నిర్వాహకులు అంటున్నారు.
ఈ భవంతిని దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్నారు. సుమారు రూ. 900 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఇప్పటికే మియాపూర్, షేక్‌పేట ఏరియాల్లో 40 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఇప్పుడు ఈ 44 అంతస్తుల భవంతి నిర్మానం పూర్తైతే జీహెచ్ఎంసీ పరిధిలో ఇదే అత్యంత ఎత్తైన భవనంగా నిలవనున్నది. హైదరాబాద్ రియల్ హబ్‌గా కూడా దూసుకుపోతున్నది. నగర శివార్లలో ఇప్పటికే అనేక రియల్ వెంచర్లు అవతరించాయి. వాటిలో నిర్మాణాలు కూడా వేగం అందుకున్నాయి.