Begin typing your search above and press return to search.
కంటైనర్ లో దొరికిన రూ.560 కోట్లు ఎవరివి?
By: Tupaki Desk | 2 April 2019 10:48 AM GMTఎన్నికల వేళ డబ్బు కట్టలు దొరకటం మామూలే అయినా..వందల కోట్లలో దొరకటం మాత్రం తమిళనాడులోనే సాధ్యమని చెప్పాలి. సినిమాల్లో మాదిరి షాక్ కొట్టేలా డబ్బు కట్టలు దొరకటం తమిళ నేల మీద తరచూ జరుగుతూ ఉంటుంది. తాజాగా డీఎంకే ప్రముఖ నేత శ్రీనివాసన్ ఇంట్లోనూ.. గోడౌన్లలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరకటం.. గోనె సంచుల్లో దొరికిన డబ్బు కట్టలు సంచలనంగా మారాయి.
ఇంత భారీగా డీఎంకే నేతల ఇంట్లో లభించటం ఒక ఎత్తు అయితే.. ఆ మధ్య కంటైనర్ లో దొరికిన రూ.560 కోట్ల సంగతి ఏమిటి? అన్న ప్రశ్ననుసంధించారు. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు? దొరికిన కంటైనర్ ను ఏం చేశారు? అందులో ఉన్న డబ్బు ఎవరిది? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు చెబుతారంటూ సీనియర్ నటి.. కాంగ్రెస్ పార్టీ మహిళా నేత కుష్బూ ప్రశ్నించారు.
ఇటీవల ఒక మంత్రి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న వేళ.. అందరూ చూస్తుండగా.. అధికారుల చేతిలో ఉన్న పత్రాన్ని తీసుకొని పారిపోయిన ఉదంతాన్ని ఆమె గుర్తు చేశారు. ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరిన ఆమె.. ఒక చిత్రమైన పోలికను ప్రస్తావించారు. ఇప్పటివరకూ పట్టుబడిన నగదు సంగతి జరిగిందేదో జరిగింది.. మర్చిపోదామంటారా? మీకు వస్తే రక్తం.. మాకు వస్తే మాత్రం టమోటా చట్నీయా అంటూ వ్యాఖ్యానించారు. కుష్బూ సంధించిన ప్రశ్నలకు ఎన్నికల అధికారులు ఏమని బదులిస్తారో చూడాలి.