Begin typing your search above and press return to search.
కరోనా సంక్షోభంలో కరెప్షన్ .. 40 వేల ఫిర్యాదులు , నివేదిక కోరిన ప్రధాని మోడీ
By: Tupaki Desk | 7 Dec 2020 12:16 PM GMTకరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలని అతలాకుతలం చేస్తుంది. ఇంకా దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే, కరోనా వైరస్ కాలంలో కరోనా సంక్షోభాన్ని కూడా కరెప్షన్ కోసం అధికారులు వాడుకున్న తీరు దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 40 వేల దాకా ఫిర్యాదులు అందాయంటే ఎంతగా అవినీతి జరిగిందో మరి. కరోనా పేషెంట్ లకు అందించే మౌలిక వసతులు, వైద్యం, వెంటిలేటర్ సదుపాయాలతో పాటుగా, ఇతర దేశాలలో చిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకురావడం, లాక్ డౌన్ సమయంలో ప్రజలపై కొనసాగిన వేధింపులు మొత్తంగా దేశవ్యాప్తంగా కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు లక్షల్లోనే ఉన్నాయి.
అందులో అవినీతి ఫిర్యాదులు 40000 ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్ కు సంబంధించిన అవినీతికి సంబంధించి కేంద్రానికి 40,000 కి పైగా ఫిర్యాదులు వచ్చాయని సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో, కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో, కరోనాకు సంబంధించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ ను ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్ కు ఇప్పటివరకు 167,000 ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ వెబ్ సైట్ లో ఈ ఫిర్యాదులు నమోదు చేయబడ్డాయి.
నవంబర్ 25 న ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ సమావేశంలో ఈ విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది. ప్రగతి వివిధ మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్న 2015 లో ప్రారంభించిన ప్రభుత్వ పరిపాలనా సంస్కరణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో కరోనా కరప్షన్ గురించి గురించి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో మరియు అవి ఏ మేరకు పరిష్కారమయ్యాయో తనకు నివేదిక కావాలని , ప్రధాని నరేంద్ర మోడీ అడిగారని తెలుస్తుంది . డేటా సమిష్టిగా ఉందని, నేడు జరిగే సమావేశంలో ఆయనకు అందజేస్తామని అధికారులు తెలిపారు.