Begin typing your search above and press return to search.
మోడర్నా టీకాతో వంద శాతం ఫలితాలు.. కానీ మనకు దక్కేలా లేదు
By: Tupaki Desk | 2 Dec 2020 12:30 AM GMTకరోనా మహమ్మారి కట్టడికి టీకా అందించడం కోసం ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాలు పరిశోధనలో ముందడుగు వేశాయి. మరికొద్ది రోజుల్లో టీకాను విడుదల చేయనున్నాయి. ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా, ఫైజర్ లాంటి సంస్థలు తయారుచేసిన టీకాలు 60 నుంచి 95 శాతం వరకు ఫలితాలు చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో అమెరికా తయారుచేసిన మోడర్నా వ్యాక్సిన్ 100కు 100% ఫలితాలు ఇచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది. వందకు వందశాతం ఫలితాలు ఇచ్చిన మొదటి టీకా ఇదే కావడంతో.. ఎట్టకేలకు టీకా సిద్ధమైందని అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఆ టీకా అందరికీ దక్కే అవకాశం లేదని తెలుస్తోంది.
ముఖ్యంగా ఇండియాకు ఈ టీకా అందని ద్రాక్షేనని అంటున్నారు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ధర చాలా ఎక్కువగా ఉంటుందట. కరోనా కు సంబంధించి ప్రతి వ్యక్తికి రెండు డోసుల టీకా వేయాల్సి ఉంది. అయితే మోడర్నా వ్యాక్సిన్ ఒక్క డోస్ 32 నుంచి 37 డాలర్ల దాకా ఉంటుందని తెలుస్తోంది. ధర మరీ ఎక్కువగా చెబుతుండడంతో భారత ప్రభుత్వం కూడా ఈ టీకా కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు.ఒకవేళ మోడర్నా టీకాను కొనుగోలు చేసినా ఒక వ్యక్తికి రెండు డోసుల కోసం రూ. 5 వేల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
130 కోట్ల జనాభా ఉన్న మనదేశానికి అంత ధర పెట్టి టీకాలు కొనుగోలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. అందువల్లే మోడర్నా వ్యాక్సిన్ కొనుగోలుకు భారత సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. ఆస్ట్రాజెనీకా వ్యాక్సిన్ ధర 3 నుంచి 4 డాలర్ల మధ్యలోనే ఉండటంతో ఇలా అందు బాటు ధరలో వ్యాక్సిన్ అందజేసే సంస్థలతో ఒప్పందం చేసుకునేందుకు భారత్ ప్రయత్నం చేస్తోంది. మన దేశంలో కూడా మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్ తయారీలో బయోటెక్ సహా పలు సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి.