Begin typing your search above and press return to search.
ఆ షాపు ముందు జనం బారులు తీరారు!
By: Tupaki Desk | 2 July 2017 10:25 AM GMTఆ షాపు ముందు జనాలు బారులు తీరారు. అందరి మొఖాల్లో ఆందోళన. లోపల ఉన్న సరుకు స్టాక్ అయిపోతుందేమో అన్న టెన్షన్. ఇంతకీ వారందరూ క్యూలో నిలుచుంది ఏ పాల ప్యాకెట్ కోసమో, సినిమా టికెట్ కోసమో కాదు. వారందరూ మద్యం కోసం పడిగాపులు కాస్తున్నారు.
విజయవాడలోని కొత్త వైన్ షాపుల్లో మందు కన్నా రిలీజ్ సినిమా టికెట్ ఈజీగా దొరుకుతోందని మందు బాబులు ఆవేదన చెందుతున్నారు. అందులోనూ, ఆదివారం సెలవు రోజు కావడంతో మందుబాబులందరూ బారుల ముందు బారులు తీరారు. కొత్త మద్యం పాలసీ పుణ్యమా అని నవ్యాంధ్రలో వైన్ షాపులలో సండే సందడి మొదలైంది. మద్యం కొరత ఎక్కువగా ఉందని తెలియడంతో హడావిడిగా వైన్ షాపుల ముందు ప్రత్యక్షమైపోయారు.
బందరు రోడ్డు వద్ద ఉన్న మనోరమ సెంటర్ లోని వైన్ షాప్ వద్ద మద్యం కొనుగోలుదారులు భారీ సంఖ్యలో వచ్చారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మద్యం కోసం తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మందుబాబులను అదుపు చేస్తున్నారు. లైన్ లో వచ్చిన వారికే మందు విక్రయిస్తారని వైన్ షాప్ యజమానులు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/