Begin typing your search above and press return to search.

మారుతీరావు అంతిమయాత్రకు భారీ సంఖ్యలో జనం

By:  Tupaki Desk   |   9 March 2020 1:24 PM GMT
మారుతీరావు అంతిమయాత్రకు భారీ సంఖ్యలో జనం
X
ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారంనాడు మారుతీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఉదయం 10 గంటలకు మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటికలో మారుతీరావు అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. మారుతీరావు అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. భారీ జన సందోహం మధ్య మిర్యాలగూడంలోని వీధుల గుండా మారుతీరావు పార్థివ దేహాన్ని ఊరేగింపుగా శ్మశానవాటికకు తీసుకు వెళ్లారు.

అంతకుముందు స్వగృహంలో ఉన్న మారుతీరావు మృతదేహానికి బంధువులు, సన్నిహితులు నివాళులర్పించారు. మిర్యాల గూడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్న మారుతీరావు స్నేహితులు, సన్నిహితులు మారుతీరావును కడసారి చూసేందుకు తరలివచ్చారు. ఇక, మారుతీరావు అంతిమయాత్రలో ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. భారీ భద్రత నడుమ మారుతీరావు అంతిమయాత్ర సాగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాశారు. మిర్యాలగూడలోని శ్మశానవాటికలో మారుతీరావు అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోను శ్మశానవాటిక చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. మారుతీరావు కుమార్తె అమృత అక్కడకు చేరుకుంది. అయితే, మారుతీరావును అమృత చూసేందుకు కుటుంబసభ్యులు నిరాకరించడంతో పోలీసులు అమృతను వెనక్కు పంపించారు.