Begin typing your search above and press return to search.
నెంబర్ 1 కంటే.. ‘9999’ ఖరీదెక్కువ
By: Tupaki Desk | 14 Nov 2015 5:54 AM GMTనెంబర్ ‘‘1’’కు ఉంటే క్రేజ్ అంతాఇంతా కాదు. కానీ.. నెంబర్ వన్ కంటే కూడా నెంబర్ ‘9999’’కే ఎక్కువ క్రేజ్ అన్నదే కాదు.. నెంబర్ వన్ కంటే కూడా ‘9999’ ఖరీదెక్కువన్న విషయం తాజాగా నిరూపితమైంది. వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు అమ్మటం తెలిసిందే. అయితే.. నెంబరు ‘1’ కంటే కూడా నెంబరు ‘9999’కు అత్యధిక డిమాండ్ ఉండటం విశేషం.
విశాఖపట్నంలో రవాణా శాఖ తాజాగా నిర్వహించ ఫ్యాన్సీ నెంబర్ల వేలం పాటలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫ్యాన్సీ నెంబర్లను సొంతం చేసుకోవటం కోసం భారీగా పోటీ పడ్డారు. ఏపీ 31 డీఏ 9999 నెంబరు కోసం అత్యధికులు పోటీ పడటం విశేషం. దీని కోసం వేలం పాటలో రూ.3.51 లక్షలు పెట్టి ఈ మేజిక్ నెంబరును సొంతం చేసుకున్నారు. అదే సమయంలో నెంబరు ‘‘1’’కు మాత్రం కేవలం రూ.1.1లక్షలు మాత్రమే పలకటం గమనార్హం.
ఇక.. నెంబరు ‘‘7’’కు రూ.90,300.. నెంబరు ‘‘9’’కి రూ.1.17 లక్షల ధర పలకకగా.. మొత్తమ్మీదా ఫ్యాన్సీ నెంబర్లతో రవాణా శాఖకు రూ.10.2లక్షల ఆదాయం లభించింది. గతంలో వేరే సీరిసీ కు ‘9999’ నెంబరుకు రూ.2.85లక్షల ధర పలికితే.. తాజాగా పాత ధర కంటే రూ.66వేలు అదనంగా ధర లభించటం విశేషంగా చెప్పొచ్చు.