Begin typing your search above and press return to search.
కార్పొరేట్ల దూకుడు.. ఉద్యోగాలు బోలెడు..
By: Tupaki Desk | 19 July 2019 8:36 AM GMTకార్పొరేట్లు కదలివస్తున్నారు.. కంపెనీలను ఏర్పాటు చేయడానికి దేశంలోని 8 ప్రధాన నగరాలకు పోటెత్తుతున్నారు. తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి లీజుకు ‘ఆఫీస్ స్పేస్’ను భారీగా తీసుకుంటున్నారు. తద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతుండడం విశేషం.
ఈ జూన్ తో ముగిసిన త్రైమాసికం మూడునెలల్లోనే దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఏకంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ రెట్టింపు అవ్వడం విశేషం. 1.87 కోట్ల చదరపు అడుగులుగా నమోదైంది. కార్పొరేట్ కంపెనీలు, కోవర్కింగ్ స్పేస్ కంపెనీల నుంచి ఈ కార్యాలయాల స్థలాలకు డిమాండ్ పెరిగిపోయిందని కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ (సీఅండ్ డబ్ల్యూ) సంస్థ నివేదికలో వెల్లడించింది. వీటివల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగాయని తెలిపింది.
సీఅండ్ డబ్ల్యూ సంస్థ నివేదిక ప్రకారం.. ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఒప్పందాలు అత్యధికంగా జరిగిన నగరంగా బెంగళూరు నిలిచింది. ఆ తర్వాత ఢిల్లీ- ముంబై- హైదరాబాద్ లోనూ భారీగానే ఒప్పందాలు జరిగాయని తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఈ ఎనిమిది నగరాల్లో 3.2 కోట్ల చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారని తెలిపింది. 2018 సంవత్సరంతో పోలిస్తే ఇది 66శాతం పెరగడం విశేషం.
ఈ ఆఫీస్ స్పేస్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్న వాటిల్లో ఐటీ, బీపీఎం కంపెనీలు 41శాతంగా ఉన్నాయి. క్యాప్టిన్ సెంటర్ల వాటా 15శాతంగా ఉంది. కోవర్కింగ్ స్పేస్ కంపెనీల వాటా 10శాతంగా ఉంది. అంటే అత్యధికంగా సాఫ్ట్ వేర్ కంపెనీలే నగరాలకు తరలివస్తూ ఐటీ కంపెనీలను విస్తరిస్తున్నాయని అర్థమవుతోంది. తద్వారా ఇంజినీర్లకు ఉద్యోగాలు దొరుతున్నాయని తెలుస్తోంది.