Begin typing your search above and press return to search.
సౌత్ ఇండియన్స్ వెంట్రుకలకి ప్రపంచం లో ఎందుకంత భారీ డిమాండ్!
By: Tupaki Desk | 12 April 2021 8:30 AM GMTనల్ల రంగు తప్ప ఇతర రకాల రంగుల వినియోగం తక్కువ కావడంతో పాటు సిల్కీగా ఉండే దక్షిణాది వారి తల వెంట్రుకలతో తయారయ్యే విగ్గులకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్న కొన్ని ముఠాలు తల వెంట్రుకల్ని మయన్మార్ మీదుగా చైనాకు అక్రమ రవాణా చేస్తున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అస్సోం రైఫిల్స్ సహకారంతో నిఘా ముమ్మరం చేశారు. లూజ్ హెయిర్ సేకరణకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. దీనిని తమకు అనువుగా మార్చుకుంటున్న స్మగ్లర్లు ఏరియాల వారీగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా నడుపుతున్న ఎనిమిది మంది ఏజెంట్లు దక్షిణాదిలోని అనేక ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. వీరు ప్రధానంగా ఆయా ప్రాంతాల్లోని సెలూన్ల నుంచి వెంట్రుకలు సేకరిస్తారు. వీటిని పాత వస్త్రాల పేరుతో ప్యాక్ చేసి బస్సుల్లో హైదరాబాద్ కు తరలించారు.
ఈ వెంట్రుకలు చేరాల్సింది చైనాకే అయినప్పటికీ నేరుగా వెళ్లడం లేదు. విదేశాలకు ఎయిర్ కార్గో ద్వారా పంపిస్తే డీఆర్ ఐ, కస్టమ్స్ సహా వివిధ ఏజెన్సీల కన్ను పడే అవకాశం ఉండటంతో వీటిని వేర్వేరు పేర్లతో రైళ్లు, బస్సులు, ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీల ద్వారా కోల్ కతాకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తమ వాహనాల్లోనే మయన్మార్ కు తీసుకెళ్తున్నారు. అధికారికంగా తల వెంట్రుకలు ఖరీదు చేయడానికి, వీటిని ప్రాసెస్ చేసి విదేశాలకు పంపడానికి ‘హ్యూమన్ హెయిర్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ & మ్యాన్ ఫ్యాక్చరర్స్ అండ్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఓ సంస్థ పని చేస్తోంది. వీరు వేలం పాటల ద్వారా వివిధ ప్రార్థన స్థలాల నుంచి తల వెంట్రుకల్ని ఖరీదు చేసి ప్రాసెసింగ్ అనంతరం నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. వీరు చైనాకు తల వెంట్రుకల్ని పంపినప్పుడు 26 శాతం ఇంపోర్ట్ డ్యూటీ చెల్లించాల్సి వస్తోంది. స్మగ్లర్ల ద్వారా అడ్డదారిలో చేరుతున్న తల వెంట్రుకలకు ఇలాంటి పన్నులు లేకపోవడంతో తక్కువ ధరకు అమ్మేస్తున్నారు.
చైనాలోని తల వెంట్రుకల్ని ఖరీదు చేసే సంస్థలు నగరంలో ఉన్న తమ ఏజెంట్లకు డబ్బును అక్రమ మార్గంలోనే పంపిస్తున్నాయి. ప్రధానంగా వీరు హవాలా, బిట్ కాయిన్స్ మార్గాలను అశ్రయిస్తున్నారు. గత ఏడాది వెలుగులోకి వచ్చిన కలర్ ప్రిడెక్షన్ కేసు దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆన్ లైన్ గేమింగ్ ను నిర్వహించిన చైనా సంస్థలు దీని ద్వారా యువత నుంచి దోచుకున్న డబ్బును డాకీ పే అనే పేమెంట్ గేట్ వేకు పంపారు. అక్కడ నుంచి ఈ డబ్బులో రూ.20 కోట్లు ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు జుట్టు వ్యాపారులకు చేరింది. ఈ విషయాన్ని గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిని ప్రశ్నించగా తాము జుట్టును చైనాకు పంపిస్తామని, అందుకు సంబంధించిన నగదు డాకీ పే ద్వారా తమకు చేరిందని చెప్పుకొచ్చారు.