Begin typing your search above and press return to search.
షాకింగ్ రిపోర్టు.. కరోనా మరణాల్లో భారీ తేడాలు!
By: Tupaki Desk | 15 Jun 2021 12:30 AM GMTగడిచిన ఏడాది కాలంగా తెలంగాణలో కరోనా కారణంగా 3,257 మంది మరణించారని వైద్య ఆరోగ్యశాఖ నివేదికలు చెబుతున్నాయి. కానీ.. ఈ కాలంలో ఒక్క హైదరాబాద్ లోనే ఏకంగా 32,752 డెత్ సర్టిఫికెట్లు జారీచేసినట్టు ఆర్టీఐ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ రిపోర్టు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఒక్క హైదరాబాద్ లోనే 32 వేల మంది చనిపోతే.. రాష్ట్రం మొత్తంలో ఇంకా ఎంత మంది చనిపోయారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య సంభవించిన మరణాలు 18,420 ఉండగా.. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 14,332 మరణాలు నమోదైనట్టు ఆర్టీఐ రిపోర్టు చెబుతోంది. కానీ.. వైద్యఆరోగ్య శాఖ మాత్రం కేవలం 3,257 మంది మాత్రమే చనిపోయినట్టు చెబుతోంది. మరి, మిగిలిన వాళ్లంతా ఎలాంటి కారణాలతో చనిపోయారని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
దీన్నిబట్టి రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత భయంకరంగానే ఉందని వారు అంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు కొవిడ్ మరణాలను తగ్గించి చూపుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్టీఐ నివేదిక ప్రకారం చూస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ప్రతి ఏటా నమోదయ్యే మరణాల లెక్కలు తీస్తే.. వాస్తవంగా కరణాతో మరణించిన వారి సంఖ్య తేలిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.