Begin typing your search above and press return to search.
గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్... రేషన్ జీపీఎస్ తో గుట్టు రట్టు
By: Tupaki Desk | 15 Nov 2021 6:36 AM GMTమహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యార్‌పట్టి అడవుల్లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో 26 మంది మృతిచెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మావోయిస్టుల కాల్పుల్లో పోలీసులు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. ఎదురు కాల్పుల్లో నలుగురు జవాన్లకు తీవ్ర గాయలైనట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ పేర్కొన్నారు. నిఘా వర్గాల సమాచారంతో మావోయిస్ట్‌ల కోసం భద్రతా బలగాలు గ్యారపట్టి ప్రాంతంలో గాలిస్తుండగా....ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరగ్గా.. మావోయిస్టులు భారీ సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది. ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఎంఎంసీ జోన్‌లో మావోయిస్టు పార్టీ విస్తరణ, కొత్త రిక్రూట్ మెంట్ ల బాధ్యతలు నిర్వహిస్తున్న మిలింద్ తేల్టుంబ్డే ఇటీవలికాలంలో 100 మందికి పైగా యువతను దళంలో చేర్పించినట్లు తెలిసింది.ఛత్తీస్ గఢ్ లో పార్టీ బలంగా ఉండడం, మహారాష్ట్ర షెల్టర్ జోన్ గా ఉపయోగపడుతుండడం తో ఎంపీలోనూ పార్టీ ఉనికిని పెంచాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. దీన్ని అమలు చేసేందుకు కొత్త రిక్రూటీలు, వివిధ దళాల కమాండర్లు, సభ్యులంతా గ్యారాపత్తి, కోట్గుల్ పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో క్యాంపులు పెట్టారు. ఇటీవల వారికి ఓ ట్రక్కు ద్వారా రేషన్ బియ్యం అందినట్లు తెలిసింది. ప్రభుత్వ రేషన్ ట్రక్కుకు జీపీఎస్ ట్రాకింగ్ ఉండడం ఆ ట్రక్కు ఎలెవన్ బట్టి అడవుల్లో గ్యారాపత్తి సమీపంలో ఎక్కువసేపు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
దాంతో పెద్ద సంఖ్యలో నక్సల్స్ అక్కడ మకాంవేసి ఉంటారనే అనుమానంతో, శనివారం తెల్లవారుజాము నుంచే సీ-60 కమాండోలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు వీరి జాడను గుర్తించి, కాల్పులు జరపడంతో ఎన్ కౌంటర్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సీ-60 కమాండోలు చుట్టుముట్టి ముప్పేట దాడి చేయడంతో మావోయిస్టులు ట్రాప్ లో చిక్కుకున్నట్లైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్ కౌంటర్ స్థలంలో కేవలం 26 మృతదేహాలుండగా, నష్టం ఇంకా ఎక్కువగా ఉండి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 70 మంది వరకు నక్సల్స్, కొత్త రిక్రూటీలు అడవుల్లోకి పారిపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోయి ఉంటారనే అంచనాల నేపథ్యంలో సీ-60 కమాండో దళాలు ఆదివారం సంబురాలు జరుపుకొన్నాయి. ఈ ఎన్‌కౌంటర్ తమ విజయాల్లో అతిపెద్దదని చెప్పాయి.
ఎదురుకాల్పుల్లో చనిపోయిన 26 మంది నక్సల్స్‌లో అగ్రనేత, మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తెల్టుంబుడే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. ఈ ఆపరేషన్‌లో మహారాష్ట్ర సీ-60 పోలీస్ కమాండో టీమ్ పాల్గొన్నట్టు మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాస్లే పాటిల్ తెలిపారు. అలాగే, కోరేగావ్ భీమా కేసుతో సంబంధం ఉన్న మిలింద్ హతమయ్యాడనేది పరిశీలించాల్సి ఉందని ఆయన తెలిపారు.