Begin typing your search above and press return to search.
ఫేస్ బుక్, టెలిగ్రామ్ కు భారీ ఫైన్.. నెల వ్యవధిలో రెండోసారి!
By: Tupaki Desk | 12 Jun 2021 12:30 AM GMTసామాజిక మాధ్యమాల దిగ్గజ సంస్థలు ఫేస్ బుక్, టెలిగ్రామ్ లకు రష్యా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ రెండు సంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా విధించింది. నిషేధిత కంటెంట్ ను తొలగించడంలో ఇవి విఫలం కావడం వల్ల రష్యా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదని ఆ దేశ కోర్టు హెచ్చరించింది.
చట్టవిరుద్ధమైన కంటెంట్ తొలగింపు విషయంలో రష్యా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకుగాను ఫేస్ బుక్ కు 17 మిలియన్ రబెల్స్ అనగా 2.36 లక్షల డాలర్లను విధించింది. 10మిలియన్ రబెల్స్ అనగా 1.39 లక్షల డాలర్లు చెల్లించాలంటూ ఆ దేశ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ సామాజిక మాధ్యమాలకు జరిమానా విధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. నిషేధిత కంటెంట్ విషయంలోనే ఇదివరకు ఫైన్ వేసింది. గతనెలలో ఫేస్ బుక్ 26మిలియన్ రబెల్స్, టెలిగ్రామ్ కు 5మిలియన్ రబెల్స్ జరిమానా విధించింది.
సామాజిక మాధ్యమాల కంటెంట్ విషయంలో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. నిషేధిత కంటెంట్ ను తొలగించాల్సిందేనని ఆదేశించింది. సోషల్ మీడియా కంటెంట్ పై కఠినంగా వ్యవహరిస్తామని పునరుద్ఘాటించింది.