Begin typing your search above and press return to search.

మోడీ ప్ర‌మాణ‌స్వీకారానికి విదేశీ నేత‌లు పోటెత్త‌నున్నారా?

By:  Tupaki Desk   |   25 May 2019 9:10 AM GMT
మోడీ ప్ర‌మాణ‌స్వీకారానికి విదేశీ నేత‌లు పోటెత్త‌నున్నారా?
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని సాధించిన మోడీ త‌న విజ‌యాన్ని విశ్వ‌వ్యాప్తంగా చేయాల‌ని భావిస్తున్నారా? వ‌రుస‌గా రెండోసారి దేశ ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న ఆయ‌న‌.. తాను సాధించిన గెలుపును పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకోవ‌టంతో పాటు..తానెంత బ‌ల‌మైన నేత అన్న విష‌యాన్ని చెప్పే దిశ‌గా పావులు క‌దుపుతున్నారా? అంటే అవున‌ని చెప్పాలి.

ఈ నెల 30న ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న మోడీ.. ఆ కార్య‌క్ర‌మానికి విదేశీ ప్ర‌ముఖుల్ని ప‌లువురిని పిలిచే అవ‌కాశం ఉందని చెబుతున్నారు. తొలిసారి ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన స‌మ‌యంలోనూ ప‌లువురు విదేశీ నేత‌ల్ని ఆయ‌న ఆహ్వానించారు. తాజాగా.. మ‌రింత ఎక్కువ‌మంది విదేశీ నేత‌ల‌కు ఆహ్వానాలు పంపాల‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం భార‌త్ ఇరుగుపొరుగు దేశాధినేత‌ల‌తోపాటు ఆగ్రేయాసియా..ప‌శ్చిమాసియా దేశాల అధ్య‌క్షుల్ని ఆహ్వానించాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమ‌ర్ పుతిన్.. జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే.. అబుదాబీ యువ‌రాజు.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెతాన్యాహుతో పాటు ఐక్య‌రాజ్య‌స‌మితి పీ5 దేశాల అధినేత‌ల్ని ఆహ్వానిస్తార‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే యూఎస్.. చైనా.. ర‌ష్యా.. ఫ్రాన్స్.. యూకే దేశాల‌కు చెందిన అధినేత‌లు కూడా వ‌స్తారు. ఇంత భారీ ఎత్తున ప్ర‌మాణ‌స్వీకారోత్సావాన్ని నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. త‌న ప‌వ‌ర్ తెలిపేందుకు మోడీ చేస్తున్న ప్ర‌య‌త్నం ఎంత‌మేర ఫ‌లిస్తుందో చూడాలి.