Begin typing your search above and press return to search.

కీసర ఎమ్మార్వో బినామీల లాకర్లలో భారీగా బంగారం!

By:  Tupaki Desk   |   22 Oct 2020 2:30 PM GMT
కీసర ఎమ్మార్వో బినామీల లాకర్లలో భారీగా బంగారం!
X
తెలంగాణలో బయటపడ్డ అత్యంత పెద్ద అవినీతి కేసుల్లో మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు కేసు ఒకటి. ఆయన ఏకంగా 1.10 కోట్ల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆ కేసు విచారణలో భాగంగా జైల్లో ఉన్న నాగరాజు ఇటీవలే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.

అయితే ఇప్పటికే కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ సోదాలను ముమ్మరం చేసింది. నాగరాజు కుటుంబానికి బినామీగా అనుమానిస్తున్న నందగోపాల్ ఇంట్లో రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తాజాగా నందగోపాల్ కు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ లాకర్ లో కూడా సోదాలు చేస్తున్నారు.

నందగోపాల్ కు సంబంధించి లాకర్ పూర్తిగా నాగరాజు భార్య స్వప్న ఉపయోగించుకుంటున్నట్లుగా ఏసీబీ విచారణలో నందగోపాల్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆ బినామీల ఇళ్లలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.

తాజాగా సోదాల్లో 1256 గ్రాముల బంగారు నగలు లభ్యమయ్యాయి. ఈ కేసులో ఏసీబీ అధికారులకు మరిన్ని ఆస్తులకు సంబంధించిన ఆధారాలు దొరికినట్టు సమాచారం.