Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ కెప్టెన్ కు అందలం.. టీమిండియాకు ఇది ఘోర అవమానమే?

By:  Tupaki Desk   |   16 Nov 2021 8:45 AM GMT
పాకిస్తాన్ కెప్టెన్ కు అందలం.. టీమిండియాకు ఇది ఘోర అవమానమే?
X
ప్రపంచకప్ టీ20లో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన టీమిండియాకు ఇప్పుడు అంతకుమించిన అవమానం ఒకటి చోటుచేసుకుంది. టీ20 ప్రపంచకప్ ముగియడంతో ఐసీసీ ఇప్పుడు ఈ టోర్నీలో మోస్ట్ వాల్యుబుల్ ఆటగాళ్లతో కూడిన జాబితాను ప్రకటించింది. ఈ టీంలో భారత్ నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. మొత్తం ఆరు జట్ల నుంచి ఆటగాళ్లను ఐసీసీ వారి పర్ ఫామెన్స్ ఆధారంగా పరిగణలోకి తీసుకుంది.

విశేషం ఏంటంటే శ్రీలంక లాంటి చిన్న జట్ల నుంచి కూడా ఆటగాళ్లను తీసుకుంది ఐసీసీ. భారత్ కు మాత్రం మొండి చేయి చూపెట్టింది. ఈ జట్టుకు ఏకంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ను కెప్టెన్ గా ఐసీసీ పేర్కొంది. ఐసీసీ ప్రకటించిన టీంలో ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇక ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు, శ్రీలంక నుంచి ఇద్దరు, న్యూజిలాండ్ నుంచి ఒకరు, పాకిస్తాన్ కు చెందిన ఒక ఆటగాడికి చోటు ఇచ్చింది. కనీసం 12వ ఆటగాడిగా కూడా టీమిండియాకు చోటు ఇవ్వలేదు. ఆ ప్లేసులో 12వ ఆటగాడిగా పాకిస్తాన్ కు చెందిన షహీన్ షా ఆఫ్రిదిని ఐసీసీ ఎంపిక చేసింది.

ఐసీసీ ప్రకటించిన మోస్ట్ వాల్యుయేబుల్ ప్లేయర్స్ ఆఫ్ టీ20 వరల్డ్ కప్ 2021 ఇదే..

బాబర్ అజమ్ , పాకిస్తాన్ (కెప్టెన్)
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
బట్లర్ (ఇంగ్లండ్)
అసలంక(శ్రీలంక)
మర్ క్రమ్,  (దక్షిణాఫ్రికా)
మెయిన్ అలీ  (ఇంగ్లండ్)
హసరంగ, (శ్రీలంక)
జంపా (ఆస్ట్రేలియా)
హేజిల్ వుడ్ (ఆస్ట్రేలియా)
బౌల్ట్ (న్యూజిలాండ్)
నార్జ్ (దక్షిణాఫ్రికా)

12వ ఆటగాడిగా షాహిన్ అఫ్రిది