Begin typing your search above and press return to search.

పొట్ట పెరిగితే మీ జ్ఞాపకశక్తి ఢమాల్!

By:  Tupaki Desk   |   12 July 2020 2:30 AM GMT
పొట్ట పెరిగితే మీ జ్ఞాపకశక్తి ఢమాల్!
X
ఏ పద్ధతి పాటించినా, బరువు ఓవరాల్‌గా తగ్గుతుంది. కానీ భారతీయులకు పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. దీనినే 'సెంట్రల్‌ ఒబేసిటీ' అంటారు. పొట్ట పెరిగిన వారిలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయని తాజా పరిశోధనలో తేలింది. పొట్ట పెరిగే కొద్దీ మెదడులోని మెమొరీ తగ్గిపోతుందని లండన్ యూనివర్సిటీ కాలేజీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మెదడులో డెమెంటీయా (మతిమరుపు తరహా) వ్యాధికి దారి తీస్తుందని కనుగొన్నారు.

*పొట్ట భాగం మామూలుగానే అధికంగా ఉండటం వల్ల, మొత్తం బాడీ తగ్గినా... ఇంకా పొట్ట భాగం తగ్గనట్టే ఉంటుంది. పొట్ట ఆకారం మనం చేసే పనిని బట్టి మారుతూ ఉంటుంది.

*ఎక్కువసేపు కూర్చొని ఉండేవారికి పొట్ట భాగం అధికంగా ఉంటుంది. అలాగే ప్రతి రోజూ మద్యం, ఫాస్ట్ ఫుడ్, చిరుతిళ్ళు తీసుకొని, ఆ తరవాత భోజనం చేసేవారికి కూడా ఎక్కువ పొట్ట తయారవుతుంది.

*పొట్ట భాగంలో కొవ్వు తగ్గడానికి మూడు సూత్రాలను తప్పక పాటించాలి. అవేమిటంటే...
*1. జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచాలి. అంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ప్రతి రోజూ నిద్రకుపక్రమించే ముందు ఇసబ్‌గోల్‌, ఫైబర్‌ సోంపు, ఉసిరి కలిసిన మిశ్రమాన్ని నీటిలో కలుపుకొని తీసుకుంటే, జీర్ణకోశం శుభ్రంగా ఉంటుంది. పొట్ట తేలిక పడుతుంది.

*2. మద్యం తాగడం, చిరుతిళ్ళు తినడం తగ్గించాలి. లేదంటే మానేయాలి. స్వీట్స్‌ ప్రతిరోజూ తినేవారు ఆ అలవాటు మార్చుకోవాలి. నెలకు ఒక్కసారి మాత్రమే స్వీట్స్‌ తీసుకోవాలి.

*3. రాత్రి భోజనానికి బదులుగా తాజా కొబ్బరి సలాడ్‌ తినాలి.