Begin typing your search above and press return to search.
తెలంగాణ @ 90......
By: Tupaki Desk | 13 Dec 2018 10:39 AM GMTముందస్తు ముగిసింది. బంపర్ మేజారిటి తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే నదులన్నీ సముద్రంలోనే చిన్న పార్టీన్ని కూడా పెద్దపార్టీలలోనే కలుస్తాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చితక పార్టీలన్నీ కూడా కారుబాట పట్టాయి. మొత్తం 119 స్దానాలకు గాను తెలంగాణ రాష్ట్ర సమితి 88 స్దానాలను కైవసం చేసుకుంది. ముందస్తు ఫలితాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలోకి ఇంకా చాల మంది ఎమ్మెల్యేలు చేరుతున్నారని, పలువురు కాంగ్రెస్ నాయకులు తన తో టచ్ లో ఉన్నారని త్వరలో వాళ్లంత టీఆర్ఎస్ లో చేరబోతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్దులు కేసీఆర్ నాయకత్వంలో భవిష్యత్తులో పనిచేయడం తమ అద్రుష్టం అని వారన్నారు.
స్వతంత్ర అభ్యర్ది అయిన కె. చందర్ రామగుండం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్దియైన సోమారపు సత్యనారయణ పై భారీ మెజారిటీతో గెలిచారు. టీఆర్‌ఎస్ అభ్యర్దియైన సోమారపు సత్యనారయణకు 34,981 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్దియైన చందర్‌కు 61,400 ఓట్లు వచ్చాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ధర్మపురి నియోజరవర్గం ఎమ్యెల్యే అయిన కొప్పుల ఈశ్వర్ ద్వారా టిఆర్ఎస్ లో చేరినట్లు తెలుస్తోంది. ఇక వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ది గా పోటీ చేసి విజయం సాధించిన రాములు నాయక్ కూడా గులాబి కండువా కప్పుకున్నారు. ఈయన ఫలితాల అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడైన కెటీఆర్ ను కలసి, టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఆ తర్వాత ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ను మర్యదపూర్వకంగా కలిసారు. ఎన్నికలకు ముందే మజ్లీస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కి మద్దతు ఇస్తున్నట్లు చెప్పింది. కాబట్టి భారీ మెజారిటీతో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితిలోకి రాబోయే వారం రోజులలో ఇంక వలసలు ఉంటాయని అటు టీఆర్‌ఎస్ నాయకలు, ఇటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే తెలంగాణ లో ఇక విపక్షాలే ఉండవా.... శాసనసభలలో వాడి, వేడి చర్చలు ఉండవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.