Begin typing your search above and press return to search.
1.2 లక్షల ఫొటోలు.. 30 టీబీ హార్డ్ డిస్క్స్
By: Tupaki Desk | 20 Dec 2018 10:14 AM GMTభారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ వివాహం బడా పారిశ్రామికవేత్త ఆనంద్ పరిమల్ తో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి మీడియా విస్తృత కవరేజ్ దక్కింది. ఈ విలాసవంతమైన వివాహానికి దేశంలోని ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్ నటీనటులు.. రాజకీయ నాయకులు హాజరయ్యారు.
ఇషా-ఆనంద్ పరిమల్ వివాహానికి ఫొటోలు తీసే అవకాశం ప్రముఖ ఫొటోగ్రాఫర్ మంగళూరు కు చెందిన 47 ఏళ్ల వివేక్ సెక్కిరాకు దక్కింది. వివేక్ దేశంలోనే వివాహాలకు ఫొటోలు తీసే ప్రముఖ ఫొటోగ్రాఫర్ గా గుర్తింపు పొందాడు. ఈయన ఇప్పటికే బెస్ట్ ఫొటో గ్రాఫర్ గా 2010,2011, 2012, 2014 సంవత్సరాలకు గాను అవార్డులు పొందారు. అంబానీలకు చెందిన సన్నిహితుల పరిచయాల ద్వారా వివేక్ కు ఈ పెద్ద ఆఫర్ వచ్చిందట.
డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉండాలని మొదట వివేక్ కు చెప్పారట.. కానీ అక్టోబర్ లోనే అంబానీల వివాహానికే తనను ఎంపిక చేశారని తెలుసుకొని వివేక్ సంభ్రమాశ్చార్యాలకు గురయ్యాడట.. ఈ ఆఫర్ విషయం తెలిసి రెండు రోజుల పాటు వివేక్ కు నిద్ర కూడా పట్టలేదని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత తేరుకొని మామూలు మనిషిని అయ్యానని వివరించాడు.
అంబానీల వివాహం లో మొత్తం 1.2 లక్షల ఫొటోలను 17మంది తో కూడిన వివేక్ బృందం ఇప్పటివరకు తీశారట.. ఆ ఫొటోల సామర్థ్యం 30 ట్రిలియన్ జీబీ వరకు ఉంటుందని తెలిపారు. వివాహ ముందస్తు వేడుకల నుంచి పూర్తయ్యేక వరకు ప్రతి మూమెంట్ ను ఫొటోల్లో బంధించారట..
ఒక నెలరోజుల్లో ఫొటోలను అన్ని ఏర్చి కూర్చి అల్బమ్ తయారు చేయనున్నట్టు వివేక్ తెలిపారు. ఎంతో కష్టంతో కూడిన ఈ పనిని త్వరగానే పూర్తి చేస్తానని ఆయన తెలిపారు.