Begin typing your search above and press return to search.
కూటమి కుంపట్లు..కోదండరాంపై కొత్త ఒత్తిడి
By: Tupaki Desk | 16 Dec 2018 4:29 PM GMTతెలంగాణ ఎన్నికల్లో భాగంగా మహాకూటమి పేరుతో కాంగ్రెస్ - టీజేఎస్ - సీపీఐ - టీడీపీ బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయదుందుభి మ్రోగించిన సంగతి తెలిసిందే. మహాకూటమి పేరిట ఏర్పాటైన టీటీడీపీ - కాంగ్రెస్ - సీపీఐ - జనసమితి పార్టీలు వైఫల్యం చెందాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవంపై వివిధ పార్టీల నేతలు పోస్టు మార్టమ్ నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 16వ తేదీ ఆదివారం తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కోదండరాం - ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు..ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు టీజేఎస్ నేతలు చేశారు.
తనకు పెద్దగా రాజకీయ అనుభవం లేకపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ స్వభావాన్నిఅర్ధం చేసుకోలేకపోయానని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో సరైన వ్యూహంతో వ్యవహరించ లేక పోవటం వల్ల కూడా తాము కాంగ్రెస్ నుంచి కొన్ని సీట్లు తెచ్చుకోలేక పోయామని ఆయన నేతలతో అన్నారు. ఎన్నికల్లో తగినన్ని సీట్లు కేటాయించుకోలేక పోయినప్పటికి...ఉద్యమ ఆకాంక్షల సాధనకు - టీఆర్ ఎస్ పార్టీని గద్దె దింపడానికి కూటమిలోనే ఉంటామని ఆయన తెలిపారు. మహాకూటమిలో టీడీపీ ఉండడం వల్లే జనసమితి నష్టోపోయిందని..వెంటనే కూటమిలో నుండి బయటకు రావాలని నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ తోనే ఉండాలని మరికొందరు సూచించినట్లు తెలుస్తోంది. పంచాయతీ - లోక్ సభ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి ? ఎన్నికల్లో ఓటమిపై నేతలు విశ్లేషించుకుంటున్నారు. సమావేశం అనంతరం టీజేఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.