Begin typing your search above and press return to search.
ప్రకృతి తన ఆనందాన్ని అలా చూపించిందా?
By: Tupaki Desk | 30 May 2019 5:00 AM GMTవైఎస్ కు వర్షానికి చాలామంది లింకు పెడుతుంటారు. అదేం చిత్రమో కానీ.. చంద్రబాబు చేతిలో ఎప్పుడు రాజ్యాధికారం ఉన్నా.. వర్షాలు సంతృప్తికరంగా పడని పరిస్థితి. 2004కు ముందు ఘోర కరవు ఏపీని ఎంతలా ప్రభావితం చేసిందో తెలిసిందే. తొమ్మిదిన్నరేళ్ల బాబు పాలన తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ హయాంలో వర్షాలు భారీగా పడటమే కాదు.. కరవు అన్న మాట లేదు.
ఇదిలా ఉంటే.. పదేళ్ల తర్వాత పవర్లోకి వచ్చిన చంద్రబాబు హయాంలో వర్షాలు సరిగా పడింది లేదు. దీంతో.. బాబు ముఖ్యమంత్రి అయితే వర్షం ముఖం చాటేస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ.. బెజవాడలోకురిసిన భారీ వర్షం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గడిచిన వారం రోజులుగా మండుతున్న ఎండలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివేళ.. ఈ ఎండల్లో ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎండ తీవ్రతతో ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చే వారికి ఇబ్బంది కలుగుతుందన్న మాట వినిపించింది. అయితే.. బుధవారం అర్థరాత్రి తర్వాత పెనుగాలులు.. పెద్ద ఎత్తున వర్షం బెజవాడలో కురిసింది. దీంతో.. అప్పటివరకూ హాట్ హాట్ గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా కూల్ గా మారింది.
భారీ వర్షం కారణంగా హోర్డింగులు కొంతమేర దెబ్బ తిన్నా.. అవన్నీ కూడా ప్రమాణస్వీకారోత్సవం స్టార్ట్ అయ్యే నాటికి అన్ని సద్దుబాటు చేసేయొచ్చు. కానీ.. వాతావరణం కూల్ గా మారటం వెనుక.. జగన్ సీఎం కావటాన్ని ప్రకృతి సైతం పాజిటివ్ గా స్పందించిందన్న మాట జగన్ అభిమానుల నోట వినిపిస్తోంది. నిన్నటివరకూ నిప్పులు కురిపించిన సూరీడి మంటకు వర్షం చెక్ చెప్పటం కచ్ఛితంగా ప్రకృతి పాజిటివ్ సిగ్నలేనని చెప్పక తప్పదు.