Begin typing your search above and press return to search.
సీమ విద్యార్థులతో అట్టుడికిన బెజవాడ
By: Tupaki Desk | 14 May 2022 1:30 PM GMTరాయలసీమ వర్శిటీ వీసీ పై పలు విమర్శలు, అభియోగాలు రేగుతున్నాయి. వెంటనే ఆ పదవిలో ఆనందరావును రీకాల్ చేయాలని విద్యార్థి సంఘాలు పట్టుబడుతూ ఇవాళ (శనివారం, మే 14,2022) చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపు ఇచ్చాయి.
దీంతో బెజవాడ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీసులు తమ ఆధిపత్యం నిరూపించుకున్నారు. దీంతో జగన్ ప్రభుత్వం మరో మారు అప్రతిష్టను మూటగట్టుకుంది. నిరసనలు అంటే చాలు పోలీసులు చేస్తున్న అతి ఎలా ఉందో తెలుసు కదా!
ఆ అతికి కొనసాగింపుగానే ఇవాళ్టి పరిణామాలు ఉన్నాయి. దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజా స్వామ్య దేశంలో నిరసన చేసే హక్కు కూడా లేదా అని ప్రశ్నిస్తున్నాయి. విద్యార్థులన్న కనీస విచక్షణ లేకుండా ప్రవర్తించిన తీరుపై విమర్శలు మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఆనందరావు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నది ఓ అభియోగం. ఈ రోజు వీసీ ని తప్పించేందుకు జగన్ ఎందుకు ముందుకు రావడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు వీరు. అప్పుడు నాగార్జున యూనివర్శిటీపై అభియోగాలు వచ్చిన వెంటనే టీడీపీ సర్కార్ ను కార్నర్ చేసి, నానా యాగీ చేసిన జగన్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని వీరంతా ఆవేదన చెందుతూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ నుంచి నిధులు తీసుకోవడంలో కానీ వర్శిటీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం కానీ చేసే జగన్ సర్కారు జరంత ఆలోచిస్తే తమ సమస్య తీరిపోవును అని సీమ బిడ్డలు అంటున్నారు. అభిప్రాయపడుతున్నారు.
మొన్నటి వేళ ఉపాధ్యాయులు పీఆర్సీ రగడ అంటూ రోడ్డెక్కారు.. అప్పుడు కూడా పోలీసులు ఇదే విధంగా ఉన్నారు..ఇప్పుడు తమకూ అదే దౌర్భాగ్య గతి పట్టించారని, ఇదెంత మాత్రం తగదని అరెస్టు అయిన విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు.