Begin typing your search above and press return to search.
ఢిల్లీలో భారీగా తగ్గిన పెట్రోల్ ధర.. కేజ్రీవాల్ చేసిన పని తెలుగు సీఎంలు చేయరే?
By: Tupaki Desk | 1 Dec 2021 5:00 PM ISTఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ రాష్ట్రంలో పెట్రోల్ ధర భారీగా తగ్గేందుకు వీలుగా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. పెట్రోల్ పై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 30 శాతం వ్యాట్ ను విధిస్తోంది. తాజాగా దీన్ని 19.4 శాతం అంటే ఏకంగా 10.6 శాతం వ్యాట్ బాదుడ్ని మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. లీటరు పెట్రోల్ కు సుమారు రూ.8 - 9 మధ్యలో తగ్గే వీలుంది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ఈ రోజు (బుధవారం) అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుంది.
కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశంలో మరెక్కడా లేనిరీతిలో సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరచూ ప్రకటనలు చేస్తుంటారు. మరి.. ఇన్ని సంక్షేమ పథకాల్ని అమలు చేసే ఇద్దరు ముఖ్యమంత్రులు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా విధిస్తున్న వ్యాట్ పోటును తగ్గించేలా నిర్ణయం ఎందుకు తీసుకోరు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం రాదు. అదేమంటే.. కేంద్రం వైపు వేలెత్తి చూపే వారు.. తమ వరకు తాము చేయాల్సిన పనిని మాత్రం చేయరన్న విమర్శ ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తోంది.
దీపావళి పండుగ సందర్భంగా కేంద్రం పెట్రోల్.. డీజిల్ మీద ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలని కోరింది. ఇప్పటికే ఆ పని చేసిన కేజ్రీవాల్.. తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. వ్యాట్ ను మరింతగా తగ్గించటం గమనార్హం. తాజాగా తగ్గించిన వ్యాట్ కారణంగా లీటరుకు రూ.8 నుంచి రూ.9 మధ్యల ధర తగ్గే వీలుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.103.97 ఉండగా.. కొత్త ధర సుమారు రూ.94-95 మధ్యలో ఉండే అవకాశం ఉందని.
ఇంతకీ.. కేజ్రీవాల్ ప్రభుత్వం ఈనిర్ణయాన్ని ప్రకటించటానికి కారణం ఏమిటన్నది ఆసక్తికరమనిచెప్పాలి. కొద్ది నెలల్లో నాలుగు రాష్ట్రాలకు జరిగే ఎన్నికలే అన్న మాట వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ నాయకత్వం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ గోవా.. పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉంది.
ఈ నేపథ్యంలో వ్యాట్ పోటు తగ్గించటం ద్వారా.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం ద్వారా.. తమ ఏలుబడి ఉన్న రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ ధరలు.. మిగిలిన రాష్ట్రాల కంటే తక్కువగా ఉండటంతో పాటు.. ప్రజారంజకంగా పాలిస్తామన్న సంకేతాన్ని ఇచ్చేందుకేనని చెబుతున్నారు. ఒకవేళ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల లక్ష్యం కూడా ఇదే తీరులో ఉండి ఉంటే.. ఈపాటికి కేజ్రీవాల్ మాదిరి భారీగా వ్యాట్ తగ్గింపును ఎంజాయ్ చేసే అవకాశం తెలుగు ప్రజలకు ఉండేదని చెప్పొచ్చు.