Begin typing your search above and press return to search.
ఉత్తరాంధ్రలో జగన్ తుపాన్
By: Tupaki Desk | 24 Oct 2018 4:33 AM GMTఉత్తరాంధ్రలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం రానున్నది. దీనికి నిదర్శనమే జగన్ పర్యటనలకు వస్తున్న స్పందన అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఇంటెలిజిన్సీ నివేదికలు తెప్పించుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉత్తరాంధ్రలో జగన్ కు వస్తున్న ఆదరణ ఆయన్ని ఇబ్బందుల పాలు చేస్తోందని అంటున్నారు. ఇందుకోసమే చీటికి మాటికీ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. తితిలి తుపానుతో ప్రజలు ఇబ్బందులలో ఉంటే జగన్ రారా అని విమర్శించడం వెనుకు ఆయనకు వస్తున్న ఆదరణే అని అంటున్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ఆ జిల్లా ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. చిన్న చిన్న పట్టణాలైన బొబ్బిలి - సాలూరుల్లో జగన్ ను కలిసేందుకు - ఆయన్ని చూసేందుకు వస్తున్న వారిని చూసిన తెలుగుదేశం నాయకులకు ఉత్తరాంధ్రలో తమకు ఇబ్బందులు తప్పవని నిర్దారణకు వస్తున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా బొబ్బిలిలో మంత్రి సుజయ రంగారావుపై ప్రతిపక్ష నేత జగన్ విరుచుకుపడిన తీరుపై జిల్లా అంతటా మంచి స్పందన వచ్చిందంటున్నారు. బొబ్బిలి పౌరుషాన్ని మంత్రి ప్రత్యర్ధుల వద్ద తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించడాన్ని విజయనగరం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారంటున్నారు. నిజానికి బొబ్బిలి వంశస్ధులెవ్వరూ ఇంతకు ముందు ఇలా చేయలేదని, కేవలం పదవి కోసమే తమ ఎమ్మెల్యే ఇలా చేశారని బొబ్బిలి ప్రజలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
సాలూరులో జరిగిన సభకు లక్షల సంఖ్యలో ప్రజలు రావడం స్ధానిక తెలుగుదేశం నాయకులకు మింగుడు పడడం లేదని స్ధానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్ధిని కూడా ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర కుమార్ భంజ్ దేవ్ ను తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్ధిగా ప్రకటించింది. ఇది జరిగి దాదాపు నెల రోజులు కావస్తోంది. ఆయన నియోజకవర్గంలో తమ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. అయితే జగన్ నియోజకవర్గంలో ప్రవేశించే వరకూ తనకు తిరుగులేదని భావించిన భంజ్ దేవ్ సాలూరులో జరిగిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సభతో విజయావశాలపై అనుమానాలు వస్తున్నాయని ఆయన సన్నిహితులు అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం, ప్రతిపక్షంలో ఉండి కూడా నియోజకవర్గం గురించి ఆయన చూపిస్తున్న శ్రద్ధ ఇక్కడి గెలుపునకు కారణంగా చెబుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీలో నానాటికి పెరుగుతున్న అవినీతిపై కూడా ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని స్ధానిక రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తితిలీ తుపాను ఉత్తాంధ్ర ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తే జగన్ తుపాను తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల పాలు చేయక తప్పదని అంటున్నారు.