Begin typing your search above and press return to search.
చెరకు రైతులకు జగన్ తీపి కబురు!
By: Tupaki Desk | 30 July 2018 6:43 AM GMTప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర....దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మండుటెండలను - వర్షాలను లెక్క చేయకుండా....జననేత జగన్ అకుంటిత దీక్షతో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా....పాదయాత్ర చేస్తోన్న జననేత జగన్ కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. పాదయాత్ర పొడువునా జగన్ అడుగులో అడుగు వేసుకుంటూ....తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. తాజాగా, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటించిన జగన్ కు అక్కడి ప్రజలు జేజేలు పలికారు. చిరు జల్లులను సైతం లెక్కచేయకుండా ఉత్సాహంగా జగన్ తో పాటు పాదయాత్రలో జనం పాల్గొన్నారు. గోనేడ – తామరాడ మధ్య ఏలేరు కాలువ వంతెన జనసంద్రంతో నిండిపోయింది. ఈ సందర్భంగా చెరకు రైతులు...తమ మొరను జగన్ తో వెళ్లబోసుకున్నారు. తాను అధికారంలోకి రాగానే చెరకు రైతులను ఆదుకుంటానని జగన్ భరోసా ఇచ్చారు.
చెరకు పండిస్తున్నామన్న మాటే గానీ.....బెల్లం లో మాత్రమే తీపి ఉందని...తమ బతుకులు చేదుగా ఉన్నాయని చెరకు రైతులు వాపోయారు. చెరకు నరికి గానుగాడించి బెల్లం తయారు చేస్తుంటే కిలో బెల్లాన్ని రూ.30 - రూ.35లకు కూడా కొనడం లేదని వాపోయారు. బెల్లం తయారీకి అవుతున్న ఖర్చు - దక్కుతున్న ధర - మార్కెట్ కు తరలింపు.. కష్టనష్టాలను జగన్ కు విన్నవించారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు నష్టపోతున్నామన్నారు. ఎకరా చెరకు పండిస్తే ప్రస్తుతం రూ.10 వేలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. చెరకు రైతులకు జగన్ హామీ ఇచ్చారు. రైతుల సమస్యలపై మరింత అధ్యయం చేసి ఆదుకుంటామని జగన్ భరోసా ఇచ్చారు. రామవరం శివార్లలో ఆయిల్ పామ్ రైతులు జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీలోని ఫ్యాక్టరీకి - తెలంగాణలోని ఫ్యాక్టరీకీ నూనె రికవరీలో 2 శాతం తేడా ఉందని...అందువల్ల ఏపీ రైతులు టన్నుకు రూ.1000 వరకు నష్టపోతున్నారని వాపోయారు. మరోవైపు, తమకు గుర్తింపు ఇవ్వడంతో పాటు నిలిచి పోయిన కమ్యూనిటీ పారా మెడిక్స్ శిక్షణను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని ఆర్ ఎంపీలు విన్నవించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం లేదని నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు వాపోయారు. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని వారందరికీ జగన్ భరోసా ఇచ్చారు.