Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్ : IPL అభిమానులకి నిరాశ తప్పదా ?
By: Tupaki Desk | 4 March 2020 10:30 PM GMTIPL ..ఇండియన్ ప్రీమియర్ లీగ్. క్రికెట్ ప్రపంచంలో ఈ ఐపీయల్ లీగ్ కి ఉన్నంత క్రేజ్ .. బజ్ , మరే ఇతర లీగ్స్ కి లేదు. అది ఒక్క ఐపీఎల్ కే సాధ్యం. ప్రపంచ దేశాల స్టార్ ప్లేయర్స్ , ఉర్రుతలూగించే అద్భుతమైన విన్యాసాలు , అద్భుతమైన బ్యాటింగ్ , ఫీల్డింగ్ , బౌలింగ్ ఇలా ఒక్కటేమిటి , అన్ని కలిసి ఐపీఎల్ ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేశాయి. ఇకపోతే మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కొన్ని జట్లు ..ఐపీఎల్ కోసం కసరత్తులు కూడా ప్రారంభించేసాయి. అభిమానులు కూడా ఐపీఎల్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.
అయితే , ఇదే సమయంలో అందరి మదిలో మరో ప్రశ్న కూడా మెదులుతుంది. మరి కొద్దిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవ్వబోతున్న నేపథ్యంలో ..భారత్ లో కూడా కరోనా విజృంభిస్తుంది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుండి ప్రపంచదేశాలను వణికిస్తోంది. అయితే ఇప్పుడు ఈ కరోనా ప్రభావం క్రీడారంగం పై పడబోతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ 2020 ఐపీఎల్ షెడ్డ్యూల్ ప్రకారం జరుగుతుందా , లేదా అని సందిగ్ధత ఏర్పడింది. అయితే ఈ విషయం పై ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పందించారు. ఓ మీడియా సమావేశం లో మాట్లాడిన ఆయన 2020 పై కరోనా ప్రభావం లేదని ప్రస్తుతం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ మార్చి 29న ప్రారంభం అవుతుందని తెలిపారు.
ఇక , ఈ విషయం పై బీసీసీఐ ఛైర్మన్ , మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా స్పందించారు. ఈ ఏడాది నిర్వహించబోయే ఐపీఎల్ లో ఎలాంటి మార్పులు ఉండవని, ఐపీఎల్ అన్ని మ్యాచ్ లు షెడ్డ్యూల్ ప్రకారం జరుగుతాయని తెలిపారు. అలాగే , ఈ నెల 12న జరగబోయే వన్డే సిరీస్ కు దక్షిణాఫ్రికా భారత పర్యటనకు రాబోతుంది. ఈ వన్డే సిరీస్ లో కూడా ఎటువంటి మార్పులు లేవని దక్షిణాఫ్రికా జట్టు భారత్ పర్యటనకి వస్తుంది అని , అయితే ఈ కరోనా విషయం లో బీసీసీఐ కొన్ని జాగ్రత్తలు పాటిస్తుందని గంగూలీ తెలియజేసాడు. అయితే , కరోనా ఇప్పుడిప్పుడే ఇండియా లో విజృంభిస్తున్న నేపథ్యం లో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి ...