Begin typing your search above and press return to search.
ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన కేంద్రం
By: Tupaki Desk | 2 Dec 2021 12:32 PM GMTఏపీ ప్రభుత్వం అప్పులో ఊబీలో కూరుకుపోతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలకు పెన్షన్, ఇతర అవసరాలు కోసం తగినంత నిధులు లేక ఏపీ ప్రభుత్వం అల్లాడుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అవసరాల కోసం పంచాయతీ నిధులను డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. నిధులు డ్రా చేసుకునేందుకు వీల్లేదని కేంద్రం, ఏపీ సర్కార్ కు తేల్చిచెప్పింది. దీంతో మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని షాకిచ్చినట్లయింది. ఇప్పటికే 14,15వ ఆర్ధిక సంఘం నిధులను విద్యుత్ బిల్లుల బకాయిల పేరిట రూ. 1300 కోట్లు ప్రభుత్వం వాడుకుంది. అంతేకాకుండా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 944 కోట్లను వారం రోజుల క్రితమే పంచాయతీ అకౌంట్ల నుంచి ఆర్ధిక శాఖ మళ్లించుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి.
ఆర్థిక సంఘం నిధులు పంపేందుకు ప్రత్యేక అకౌంట్లతో పంచాయతీ పేరిట ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది. కేంద్రం ఆదేశాలివ్వడంతో పంచాయతీ రాజ్ కమీషనర్, జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 15వ ఆర్ధిక సంఘం నిధులు ఇక నుంచి ఈ అకౌంట్‌లో వేస్తామని ప్రభుత్వం తెలిపింది. అకౌంట్లు గ్రామ పంచాయతీ పేరు మీద, యూనియన్ బ్యాంక్‌లో ప్రారంభించాలని, పంచాయతీలు వెంటనే అకౌంట్లు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం తమ ప్రమేయం, పంచాయతీల తీర్మానం లేకుండానే నిధులు జమచేసుకొంటోందని సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఆర్థిక వనరులు పెరగడానికి ప్రతేక నిధులు ఇవ్వకపోగా కేంద్రం నుంచి వచ్చే నిధులను బకాయిలకు జమచేసుకొంటూ సర్పంచ్‌లు వాపోతున్నారు. ప్రభుత్వం ఇలా నిధులు తీసుకోవడం వల్ల గ్రామాభివృద్ధి కుంటుపడుతోందని అంటున్నారు. ప్రభుత్వం విద్యుత్ బిల్లుల బకాయిల పేరుతో 14, 15వ ఆర్థిక సంఘం నిధులు జమ చేసుకుంటోంది. రిజిస్ట్రేషన్ సర్‌చార్జి నిధులను పంచాయతీలకు జమచేయకుండా ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకుంటోందని సర్పంచ్ లు వాపోతున్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థలపై పెత్తనం చేస్తోందని, అభివృద్ధి, ఇతర అంశాలను సర్పంచ్‌లు, పాలకవర్గం చర్చించి నిధులు ఖర్చుచేయాలని సర్పంచ్ లు చెబుతున్నారు. ప్రభుత్వం నియమాలకు విరుద్ధంగా బకాయిల పేరుతో జమ చేసుకోవటం సరికాదని తప్పుబడుతున్నారు. దీనిపై కోర్టుకు వెళతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రప్రభుత్వం 14,15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీ విద్యుత్ బకాయిలకు ప్రభుత్వం నేరుగా జమచేసుకొంది. పంచాయతీల్లో బకాయిలు సర్పంచ్ లను వెంటాడుతున్నాయి. రెండేళ్లపాటు ప్రత్యేకాధికారులు పెద్దయెత్తున నిధులు ఖర్చుచేస్తున్నారు. రెండేళ్ల నుంచి కరోనా నివారణకు ఖర్చుచేసిన సొమ్మును ప్రభుత్వం ఇంకా పంచాయతీలకు చెల్లించలేదు. పోలింగ్ సందర్భంగా చెల్లించాల్సిన బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని సర్పంచ్ లు చెబుతున్నారు. కొన్ని పంచాయతీల్లో కొవిడ్ క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారని, వాటికి ఇంకా నిధులు జమచేయలేదని వాపోతున్నారు. ప్రత్యేకాధికారుల పాలనలో చేసిన పనులు, అప్పులకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేదని చెబుతున్నారు.