Begin typing your search above and press return to search.
బాబుకు భారీ షాక్.. నారావారిపల్లె లోనే ‘మాట’ ధిక్కరణ
By: Tupaki Desk | 5 April 2021 4:58 AM GMTకీలక నిర్ణయాన్ని తీసుకునే విషయంలో తొందరపాటు పనికి రాదు. ఇటీవల కాలంలో ఏపీ విపక్షం తెలుగుదేశం పార్టీకి వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకప్పుడు టీడీపీలో బాబు నోటి నుంచి మాట వచ్చిందంటే.. దానికి తిరుగు ఉండేది కాదు. ఇప్పుడు అందుకు భిన్నంగా పార్టీ పరంగా తీసుకన్న పాలసీ నిర్ణయాన్ని తప్పుపట్టేస్తున్న తెలుగు తమ్ముళ్ల తీరు ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది.
ఎన్నిక ఏదైనా.. ఓటమి అయితే ఖాయమన్నట్లుగా వస్తున్న ఫలితాలతో బాబు విసిగిపోయినట్లుగా చెబుతున్నారు. గతంలో తాను వ్యహాన్ని రచిస్తే.. తిరుగు ఉండేది కాదన్నట్లుగా ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా.. ఆయనేం ప్లాన్ చేసినా రివర్సు అవుతోంది. ఇటీవల కాలంలో వరుసగా జరిగిన ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బలు తిన్న వేళలో.. తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల్నిబహిష్కరిస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు.
టీడీపీ పెట్టిన తర్వాత.. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని ఇదే తొలిసారి తీసుకున్నారని చెప్పాలి. అధికారపక్షం దూకుడుతో.. మరోసారి ఎన్నికల గోదాలోకి దిగి.. ఎదురుదెబ్బలు తినే కన్నా.. వాటికి దూరంగా ఉండాలని బాబు డిసైడ్ అయ్యారు. అయితే.. బాబు తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు తమ్ముళ్లు తప్పు పట్టటమే కాదు.. కొందరు నేతలు అయితే పార్టీకి రాజీనామా చేస్తున్నారు.
మరోవైపు.. బాబు మాటనను పట్టించుకోకుండా పోటీలోకి దిగి షాకిస్తున్నారు తెలుగుతమ్ముళ్లు. అది కూడా ఎక్కడో కాదు.. ఆయన సొంతూరైన నారావారిపల్లెలో కావటం సంచలనంగా మారింది. ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు బాబు ప్రకటనను వారు పట్టించుకోవటం లేదు. బాబు మాటకు భిన్నంగా టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధర మమ్మురంగా ప్రచారం చేస్తున్నారు. భీమవరం సెగ్మెంట్ పరిధిలో ఆయన ప్రచారం చేస్తున్నారు. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా.. బాబు సొంతూరులోనూ ఆయన మాటకు విలువ లేకుండా తెలుగుతమ్ముళ్లు వ్యవహరిస్తున్న తీరు.. పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.