Begin typing your search above and press return to search.
శశికళకు ఓటుహక్కు లేకుండా చేశారు
By: Tupaki Desk | 6 April 2021 6:52 AM GMTప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటు హక్కు ఉన్నా లేకున్నా.. నేతలకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓటు హక్కు లేని వారిని చనిపోయిన వారిగానే ట్రీట్ చేస్తారు. చస్తేనే ఓటును తీసేస్తారన్న ప్రచారం ఉంది. అయితే ఆ నేతలకే ఓటు హక్కు లేదంటే అంతకంటే దరిద్రం ఇంకోటి కాదు.
తమిళనాడు రాజకీయాలను ఒకప్పుడు శాసించాలని బయలు దేరిన శశికళ అనూహ్యంగా అక్రమాస్తుల కేసుల్లో జైలు పాలై నాలుగేళ్ల తర్వాత తిరిగి వచ్చినా రాజకీయ సన్యాసం తీసుకొని వైదొలిగారు. దీని వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారన్న ప్రచారం సాగింది.
అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు ప్రముఖులంతా ఓటు హక్కు వినియోగించుకొని ఫొటోలకు ఫోజు ఇచ్చారు. అయితే శశికళ కూడా ఓటు వేసేందుకు రాగా ఆమె ఓటు హక్కు తొలగించేశారని తెలిసి అవాక్కయ్యారు.
తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న వేళ శశికళ తన ఓటు హక్కు కోల్పోయిందన్న వార్త వైరల్ అయ్యింది. అధికారులు శశికళ ఓటు హక్కును తొలగించడం చర్చనీయాంశమైంది. జయలలిత నివాసమైన పోయేస్ గార్డెన్ చిరునామాలోనే శశికళ దశాబ్ధాలుగా ఉంటున్నారు. చెన్నైలోని థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే శశికళకు గతంలో ఓటు హక్కు ఉంది.
అయితే శశికళతోపాటు పోయేస్ గార్డెన్ లో నివసించిన 19 మంది పేర్లను ఈసీ అధికారులు ఓటరు జాబితా నుంచి తొలించారు. నాలుగేళ్లు జైల్లో ఉండడంతో ఆ చిరునామాలో శశికళ లేరన్న సాకుతో ఆమెపేరును ఓటర్ల జాబితా నుంచి తొలిగించారట.. దీనిపై కనీసం పోస్టల్ బ్యాలెట్ ద్వారానైనా ఓటు హక్కు కల్పించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు.
శశికళ జైలు నుంచి రాగానే ఓటు హక్కు కోసం ఈసీని సంప్రదించారని.. అయితే అధికారులు స్పందించలేదని శశికళ న్యాయవాది చెప్పారు. ఒక పౌరురాలు ఓటు హక్కు అడిగినా ఇవ్వకుండా ఈ ప్రభుత్వమే చంపేసిందని.. ఈసీతో కలిసి ఫళని స్వామి సర్కార్ కుట్ర చేసిందని శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్ ఆరోపించారు.