Begin typing your search above and press return to search.
సుబ్బరామిరెడ్డికి భారీ షాక్.. రూ. 11 కోట్ల టోకరా !
By: Tupaki Desk | 8 Nov 2021 2:30 PM GMTఏపీ రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు టి.సుబ్బిరామిరెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి ని ముంబైకి చెందిన ఓ కంపెనీ భారీ మోసం చేసింది. ఏకంగా 11 కోట్ల రూపాయల విలువ చేసే షేర్ల వ్యవహారం లో టి సుబ్బిరామి రెడ్డిని బురిడీ కొట్టించింది ముంబై కంపెనీ. అయితే ఈ విషయం తనకు తెలియగానే సిపిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు మాజీ పార్లమెంట్ సభ్యులు టి.సుబ్బిరామిరెడ్డి.
దీనితో రంగంలోకి దిగిన సిపిఎస్ పోలీసులు ముంబై నగరానికి చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. ఛాంపియన్షిప్ లిమిటెడ్కు చెందిన చేతన్ పటేల్ అలాగే హర్షవర్ధన్ ను సిపిఎస్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది. లోన్ వ్యవహారంలో 1 శాతం షేర్ల బదిలీకి ఒప్పందం చేసుకున్న సుబ్బరామిరెడ్డి భార్య, సుబ్బరామిరెడ్డి కుటుంబానికి తెలియకుండానే ఆ ముంబైకి చెందిన కంపెనీ షేర్లు అమ్ముకుంది. దీంతో సుబ్బరామిరెడ్డి కుటుంబానికి వేగంగా 11 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయితే ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాను మోసపోయిన విషయాన్ని గ్రహించిన సుబ్బరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి చాంపియన్ పిన్స్ లిమిటెడ్‌కు చెందిన చేతన్ పటేల్, హర్షవర్ధన్‌లను అరెస్ట్ చేశారు. గుడ్డిగా ఎవరినీ నమ్మొద్దనే సందేశాన్ని ఈ ఘటన ఇస్తోందని పోలీసులు చెబుతున్నారు. నిందితుల నుంచి ఆ మొత్తాన్ని రాబట్టడంలో సాధ్యాసాధ్యాల గురించి పోలీసులు ఆర్థిక నిపుణులతో చర్చిస్తున్నారు.