Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ గూటికి ఎల్.రమణ.. చర్చలు పూర్తి
By: Tupaki Desk | 7 Jun 2021 11:30 AM GMTఒక బలమైన బీసీ నేత టీఆర్ఎస్ నుంచి వీడిపోయారు.. దీంతో అంతే బలమైన బీసీ నేతను కేసీఆర్ భర్తీ చేయబోతున్నారు. అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ పరిణామం చోటుచేసుకోబోతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను తెలంగాణ కేబినెట్ నుంచి పంపించిన టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ఇప్పుడు అదే బీసీల్లో బలమైన నాయకుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణను టీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి రెడీ అయ్యారు.
తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఎల్. రమణను టీఆర్ఎస్ లో చేర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు ఎల్. రమణ కూడా ఆసక్తిగానే ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్. రమణతో పలుమార్లు ఫోన్ లో చర్చించినట్టు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతోపాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా రమణతో చర్చలు జరిపినట్లు సమాచారం.
కాగా ఈ ప్రతిపాదనకు ఎల్. రమణ ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు తన సన్నిహితులతో చర్చించి ఓ నిర్ణయానికి రావడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ తోపాటు బీజేపీ నేతలు ఎల్. రమణతో చర్చలు జరుపుతున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ వైపే వెళ్లడానికి ఎల్. రమణ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణలో త్వరలో ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. దీనిపై ప్రస్తుతం రమణ చర్చిస్తున్నారని.. రెండు మూడు రోజుల్లోనే అభిమానులు, సన్నిహితులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.