Begin typing your search above and press return to search.

ఆర్యన్ కేసులో భారీ ట్విస్ట్.. బెయిల్ ఇక కష్టమేనా?

By:  Tupaki Desk   |   21 Oct 2021 7:24 AM GMT
ఆర్యన్ కేసులో భారీ ట్విస్ట్.. బెయిల్ ఇక కష్టమేనా?
X
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయన బెయిల్ మరోసారి రద్దు అయ్యింది. దీంతో కొడుకుకు ధైర్యం చెప్పేందుకు షారుఖ్ ఖాన్ జైలుకెళ్లారు. ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో జైల్లో ఉన్న కొడుకు ఆర్యన్ ను షారుఖ్ కలిశాడు. ఆర్యన్ కు బెయిల్ ఇచ్చేందుకు ముంబై సెషన్స్ కోర్టు నిరాకరించడంతో తీవ్ర బాధలో ఉన్న ఆర్యన్ ను షారుఖ్ పరామర్శించాడు. తనయుడి అరెస్ట్ తర్వాత షారుఖ్ తొలిసారి బయట కనిపించాడు.

ఇప్పటికే ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ ను మూడు సార్లు కోర్టు తిరస్కరించింది. డ్రగ్స్ పెడ్లర్స్ తో ఆర్యన్ కు సంబంధాలున్నాయని.. అందుకు ఆధారాలను కూడా కోర్టుకు ఎన్సీబీ సమర్పించింది. ఓ హీరోయిన్ తో ఆర్యన్ చేసిన చాటింగ్ ను కూడా కోర్టు ముందుంచారు.ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఎన్సీబీ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఆర్యన్ కు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. చివరి వరకు ఆర్యన్ కు బెయిల్ వస్తుందని ఆశతో ఉన్న షారుఖ్ కుటుంబం.. ఇప్పుడు రాకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయింది.

త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన నటితో ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్ కోర్టుకు చేరడంతో ఆయన బెయిల్ పిటీషన్ రద్దు అయ్యింది. ఆర్యన్ రెగ్యులర్ గా డ్రగ్స్ సరఫరాదారులను కలుస్తాడని కోర్టుకు ఎన్సీబీ అధికారులు వివరించారు.

కోర్టు బెయిల్ పిటీషన్ రద్దు చేసిన వెంటనే ఆర్యన్ ఖాన్ ను పోలీసులు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. ఆర్యన్ తోపాటు మరో ఇద్దరికి కూడా కోర్టు బెయిల్ నిరాకరించింది.

ఆర్యన్ కు బెయిల్ వస్తుందని.. అతడిని ఇంటికి తీసుకెళ్లడానికి పోలీస్ స్టేషన్ దగ్గర వాహనాలను షారుఖ్ ఫ్యామిలీ రెడీగా ఉంచింది. ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి ఇద్దరు లాయర్లను కూడా నియమించారు. కానీ ఎన్సీబీ అధికారుల ఆధారాలు బలంగా ఉండడంతో ఆర్యన్ కు నిరాశ తప్పలేదు.

ముంబై నుంచి గోవాకు ఓ క్రూయిజ్ షిప్ వెళ్తోంది. ఇందులో రేవ్ పార్టీ జరుగుతుందని డ్రగ్స్ కంట్రోల్ స్క్వాడ్ కు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాస్తవానికి ఈ షిప్ సోమవారం ముంబయికి తిరిగి రావాల్సి ఉంది. కానీ గోవాలో ఎన్సీబీ అధికారుల మఫ్టీలో పర్యాటలకులుగా షిప్ లోకి ఎక్కారు. ఆ తరువాత డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 8 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. షిప్ ప్రయాణం ప్రారంభించగానే వీరిని పట్టుకున్నట్లు ఎన్ సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మీడియాకు తెలిపారు.

ఇందులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు అర్భాజ్ మర్చంట్, మూన్ మూన్ ధమేచా, నూపూర్ సారిక, ఇస్మిత్ సింగ్, మోహక్ జైస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాలు ఉన్నట్లు ఎన్ సీబీ అధికారులు తెలిపారు. మొత్తంగా 8 మందిని అదుపులోకి తీసుకోగా ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్లు వారు తెలిపారు. తమకు అందిన పక్కా సమాచారంతోనే ఈ దాడి చేశామన్నారు. అయితే ఈ కేసులో ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని, సమగ్రంగా విచారిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఈ పార్టీ నిర్వహణలో ఎవరెవరి హస్తం ఉందో విచారణ చేపడుతామన్నారు. ఇప్పుడు 20 రోజులు దాటినా ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు కావడం లేదు. ఈ కేసులో ఆర్యన్ విడుదల కోసం షారుఖ్ ఫ్యామిలీ చేయని ప్రయత్నం అంటూ లేదు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..