Begin typing your search above and press return to search.
దిశ కేసులో మరో భారీ ట్విస్ట్
By: Tupaki Desk | 5 March 2020 12:00 PM GMTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం ... ఎన్ కౌంటర్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దిశ నిందితుల తల్లిదండ్రులు సుప్రీం కోర్టు ఆదేశం మేరకు ఎన్ కౌంటర్ పై నియమించిన జ్యూడిషియల్ కమిషన్ ను హైకోర్టులో కలిసారు. తమకు రావాల్సిన కుటుంబానికి 50 లక్షల పరిహారంపై వారిని కలిసి వేడుకున్నారు. జ్యూడిషియల్ కమిషన్ కు నిందితుల కుటుంబ సభ్యులు పరిహారం కోసం అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో కేసులో మళ్లీ కదలిక వచ్చింది.
దిశను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితుల కుటుంబాలు అప్పట్లో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలని... నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని... దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతూ దిశా రేపిస్టుల కుటుంబాలు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీం కోర్టు ఈ పిటీషన్ ను తిరస్కరించి దిశ కేసుపై ఏర్పాటు చేసిన జ్యూడిషియల్ కమిషన్ ను కలవాలని ఆదేశించింది. దీంతో దిశ నిందితుల కుటుంబాలు గురువారం హైదరాబాద్ లో కమిషన్ ను కలిశాయి.
తాజాగా వీరి కేసు జ్యూడిషయల్ కమిషన్ ముందుకు వచ్చింది. నలుగురు దిశా నిందితుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని వారు కోరుతూ తాజాగా పిటీషన్ దాఖలు చేశారు.
దిశపై మానవమృగాలుగా నలుగురు రేపిస్టులు చేసిన దారుణంపై దేశమంతా నిరసన తెలిపింది. ఆందోళనలు సాగాయి. వారి ఎన్ కౌంటర్ తో అందరూ శాంతించారు. ఇలాంటి క్రూరులకు బతికే చాన్స్ లేదని స్పష్టం చేశారు.