Begin typing your search above and press return to search.

జగన్ కోర్టు ధిక్కరణ కేసులో భారీ ట్విస్ట్

By:  Tupaki Desk   |   16 Nov 2020 10:10 AM GMT
జగన్ కోర్టు ధిక్కరణ కేసులో భారీ ట్విస్ట్
X
సుప్రీం కోర్టు జడ్జిపై ఇటీవల ఓ లేఖ రాసి సంచలనం సృష్టించిన ఏపీ సీఎం జగన్ ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిల్ ను తాను విచారణ చేపట్టలేనని ఈ కేసు విచారణకు వచ్చిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ తెలిపారు.

తాను ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డి తరుఫున ఓ కేసు వాదించానని.. కాబట్టి ఇప్పుడు జగన్ పై కేసును తాను విచారించడం సముచితం కాదని ఆయన కేసు విచారణ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.

సుప్రీంకోర్టులో సీజేఐ తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసి.. దాన్ని మీడియాకు బయటపెట్టిన నేపథ్యంలో ఈ కేసు దాఖలైంది.

సీజేఐ ఎస్ఏ బాబ్డేతో సంప్రదించిన తరువాత ఈ కేసును తగిన బెంచ్ కు లిస్ట్ చేయాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి జస్టిస్ ఉమేశ్ సూచించారు.

సీఎం జగన్ ను సీఎం పదవి నుంచి దించాలంటూ సుప్రీంకోర్టు న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ యాదవ్, సునీల్ కుమార్ సింగ్ లు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ వివిధ కేసులు విచారణలో ఉన్నాయని.. ఆధారాలు లేకుండా సుప్రీం జడ్జిపై ఆరోపణలు చేశారని.. ఆయనను పదవి నుంచి తొలగించాలని వారు పిటీషన్ లో సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే.