Begin typing your search above and press return to search.

అమెరికాలో కట్టిన శ్రీవారి గుడి ఎంత పెద్దదంటే..

By:  Tupaki Desk   |   13 July 2016 4:26 AM GMT
అమెరికాలో కట్టిన శ్రీవారి గుడి ఎంత పెద్దదంటే..
X
దేశంలో సందుకో గుడి కనిపిస్తుంది. కానీ.. దేశం కాని దేశంలో.. ఒక భారీ వేంకటేశ్వరస్వామి టెంపుల్ ను నిర్మించటం అంత చిన్న విషయం కాదు. అది కూడా ఏ కోటి రూపాయిలో.. రెండు కోట్లతో కాకుండా ఏకంగా రూ.120 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక దేవాలయాన్ని నిర్శించటం విశేషంగా చెప్పాలి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో.. అమెరికాలోనే అతి పెద్దదైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించటం విశేషంగా చెప్పాలి.

18 ఎకరాల స్థలంలో తామరపువ్వు ఆకారంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయంలో 9.9 అడుగుల ఎత్తైన భారీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని టీటీడీ వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిష్టించారు. ఈ సందర్భంగా భారీ కుంభాభిషేకాన్ని నిర్వహించారు. విదేశాల్లో ఉన్న శ్రీవారి ఆలయాల్లో ఇదే అతి పెద్ద టెంపుల్ గా చెబుతున్నారు.

కన్నుల పండువగా జరిగిన ఆలయ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా శ్రీవారి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక సేవల్లో ఒకేసారి ఐదు వేల మంది భక్తులు హాజరయ్యేలా భారీ ఆడిటోరియాన్నినిర్మించటం విశేషంగా చెప్పాలి. ఆలయ పాలక వర్గ సభ్యులుగా మాల్పూరి వెంకటరావు.. రవి అయ్యగారి తదితరులు ఉన్నారు. దేశం కాని దేశంలో ఇంత భారీ దేవాలయాన్ని నిర్మించటం విశేషంగానే చెప్పాలి.