Begin typing your search above and press return to search.

అమెరికాలో ఇప్పుడు అంత దారుణ పరిస్థితి

By:  Tupaki Desk   |   15 March 2017 4:28 AM GMT
అమెరికాలో ఇప్పుడు అంత దారుణ పరిస్థితి
X
కరెంటు పోవటం కూడా పెద్ద వార్తేనా? అంటే.. అమెరికాలో అన్న మాటను మరోసారి నొక్కి వక్కాణించాలి.మనకు కరెంటు పోవటం చాలా చాలా మామూలు విషయమే అయినా అమెరికా వరకూ మాత్రం అది చాలా పెద్ద విషయమే. కనురెప్ప మాటున కరెంటు పోవటాన్ని అక్కడి ప్రజలు అస్సలు జీర్ణించుకోలేరు.అలాంటిది అమెరికాలోని పలు నగరాల్లో గాఢాంధకారంలో మునిగిపోవటం చూస్తే..అమెరికాకు ఏమైందన్న డౌట్ రాకమానదు. ప్రపంచానికి పెద్దన్నేఅయినా.. ప్రకృతి ముందు పసిపాపే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు అలానే ఉన్నాయి. అమెరికా తూర్పుతీరంలో విరుచుకుపడిన మంచు తుఫానుతో అమెరికాలోని పలు నగరాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. అమెరికాలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ మంచు తుఫానుకు ప్రభావితం కావటమే కాదు.. పలు నగరాల్లో కరెంటు లేని పరిస్థితి.

చాలా అవసరం అనుకుంటే తప్పించి..ప్రజల్ని ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దంటూ అధికారులు స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేశారు. అంతేకాదు.. ఇప్పటివరకూ 8వేలకు పైగా విమానాలు రద్దు కాగా.. వేలాది స్కూళ్లను మూసేశారు. వందల కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మంచు తుఫాను కారణంగా కంటి ముందు ఏం జరుగుతుందో కూడా కనిపించని పరిస్థితి నెలకొన్నందున.. అత్యవసరం అయితే తప్పించి బయటకు రావొద్దని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు.

న్యూయార్క్..బోస్టన్ లాంటి నగరాల్నిమంచుదుప్పటి కప్పేయనున్నట్లుగా అంచనా వేస్తున్నారు. రెండుఅడుగుల మేర భారీగా మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ నివేదికలు వెల్లడిస్తున్నాయి.ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో.. అందరూ అప్రమత్తంగా కోరుతున్నారు. ముంచు తఫాను నేపథ్యంలో కార్యాలయాల్ని మూసేశారు. అత్యవసర బలగాల్నిమొహరించిన అధికారులు.. సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే.. మంగళవారం ఉదయం నుంచి కనెక్టికట్ రాష్ట్రం మొత్తంలో ప్రయాణాలపై బ్యాన్ విధించారు.

అంతేకాదు.. అటు వర్జీనియాలో పోర్ట్ ఆఫ్ వర్జీనియాను మూసేశారు. మంచుతుఫాను కారణంగా నూయార్క్ లో 20 అంగుళాలు.. మాసూచుసెట్స్ లో 24 అంగుళాలు.. ఫిలడెల్ఫియాలో 10 అంగుళాల మేర మంచు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రానున్న రెండుమూడు రోజులు అమెరికా ప్రజల్నిమంచు తుఫాను ఎంతలా వణికిస్తుందన్నది అంచనా వేయలేమన్నట్లుగా మారిందని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/