Begin typing your search above and press return to search.

మనిషుల ఎముకలు, పుర్రెలతో రోడ్డు ..ఎక్కడ వేశారంటే ?

By:  Tupaki Desk   |   19 Nov 2020 11:30 PM GMT
మనిషుల ఎముకలు, పుర్రెలతో రోడ్డు ..ఎక్కడ వేశారంటే ?
X
రోడ్లు సాధరణంగా మట్టితోనే, కంకర తోనో, లేకపోతే తార తోనో వేస్తారు. కానీ, మనిషి ఎముకలు , పుర్రెలతో వేసిన రోడ్లని ఎప్పుడైనా చూశారా? అదేంటి మీకేమైనా పిచ్చా, మనిషి ఎముకలతో రోడ్లు ఎలా వేస్తారు అని ఆశ్చర్యపోతున్నారా, ఇంతకీ మనిషి ఎముకలతో వేసి రోడ్డు ఎక్కడుంది, అసలు ఆ రోడ్డు విశేషాల గురించి పూర్తిగా చూస్తే ... రష్యా దేశంపు రాజధాని అయిన మాస్కోకు 5 వేల 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిరెన్స్క్ ప్రాంతంలోని ప్రజల కోసం వేసిన పార్టిశాన్ అలిమోవ్ స్ట్రీట్ రోడ్డు వేశారు. కొత్తగా వేసిన ఆ రోడ్డుపై ప్రజలు వెళ్తున్నారు. మంచు కురవటంతో వెళ్లటానికి ఇబ్బందిగా మారటంతో అతి జాగ్రత్తగా వెళుతున్నారు. అలా నడుస్తూ వెళ్తున్నవారు కొంచెం షాక్ అయి ఆగిపోయారు.

రోడ్డు పై కనిపించిన వాటిని ఆశ్చర్యంతో భయంతో అలాగే చూస్తూ ఉండిపోయారు. రోడ్డుపై మనుషుల ఎముకలు, పుర్రె కనిపించాయి. రోడ్డు కోసం వేసిన కంకర, ఇసుక వంటి వాటిలో మనుషుల ఎముకలను కూడా ఉండటమేంటి అని షాక్ అయ్యారు. ఆ ఎముకల్ని చూసిన స్థానికులు భయపడిపోయారు. అసలు ఏం జరిగిందో తెలియక భయాందోళలనకు గురయ్యారు. కొందరు ఆ రోడ్డును ఫోటోలు తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పోలిసుల దృష్టికి కూడా వెళ్లాయి.

దీనితో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. ప్రాంతీయ మంత్రిత్వ శాఖ కూడా దర్యాప్తు ప్రారంభించింది. అలా రోడ్డులో మనిషి ఎముకలు, పుర్రెలు ఉండటంపై ఇప్పటివరకూ జరిపిన దర్యాప్తులో ఏం బయటపడిందంటే, ఆ ఎముకలు 100 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తులవని అంచనావేశారు అధికారులు. 1917-1920 మధ్య రష్యా సివిల్ వార్‌లో చనిపోయిన వ్యక్తివి కావచ్చని మెట్రో యూకే రిపోర్ట్ చేసింది. అవి మనిషి ఎముకలే అని క్లియర్‌గా తెలిసినా, అధికారులు మాత్రం నోరువిప్పట్లేదు. దానికి గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణంలో కనిపించిన మనిషి పుర్రెను ఎప్పటిది? ఎవరిది అన్నదానిపై నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు.