Begin typing your search above and press return to search.
మనుషులను లవ్వాడే రోబోలు!
By: Tupaki Desk | 18 Jun 2017 10:40 AM GMTఇనుములో ఓ హృదయం మొలిచెనే...ముద్దిమ్మంటూ నిన్నే వలిచెనే.... రోబో సినిమాలోని ఈ పాటలో ఐశ్వర్యా రాయ్‌తో రోబో రజనీ స్టెప్పులేస్తుంటాడు. ఇదంతా శంకర్ సినిమాలకే పరిమితం అనుకోకండి. త్వరలోనే నిజంగా మనుషులకు ముద్దిచ్చే రోబోలు రాబోతున్నాయి. మరమనిషితో మనిషి జత కట్టే రోజు ఎంతో దూరంలో లేదట. 2050 కల్లా మనుషులతో రోబోలు లవ్వాడేస్తాయట. ఇదంతా టెక్నాలజీ మహిమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం మనుషులతో మనుషులకు చాలా తక్కువ అవసరం ఉంది. సమీప భవిష్యత్తులో అంత అవసరం ఉండకపోవచ్చట. ఆ స్థానాన్ని రోబోలు ఆక్రమిస్తాయట. ఇంకా చెప్పాలంటే మనుషులకన్నా అందమైన, తెలివైన రోబోలు రాబోతున్నాయి. రోబోలతో మనుషులు స్నేహం - ప్రేమ - పెళ్లి వంటి వ్యవహారాలన్నీ నడుపుతాయట. 2050 నాటికల్లా హ్యూమన్-రోబో మధ్య ఇలాంటి సంబంధం ఏర్పడుతుందని అంచనా.
రాబోయే రోజుల్లో కృత్రిమ మేథస్సును విరివిగా ఉపయోగించనున్నారు. ఇప్పటికే చైనా - జపాన్ వంటి దేశాల్లో మనుషులను పోలిన రోబోలు వినియోగంలోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న యాంత్రిక జీవితంలో మనుషుల మధ్య బంధాలు, బంధుత్వాలు నానాటికీ దిగజారిపోతున్నారయి.చాలా మంది స్త్రీ పురుషులు ఒంటరి జీవితానికి అలవాటు పడిపోతున్నారు.అటువంటి మగవారికి ఆడ రోబో, ఆడవారికి మగ రోబో తోడవబోతోందట.
మనుషుల అవసరాలు తీర్చడమే కాకుండా, వారి భావోద్వేగాలు పంచుకునే రోబోలు కూడా వస్తాయట. అదే జరిగితే అంతంత మాత్రం ఉన్న మానవ సంబంధాలు మరుగున పడిపోయే అవకాశముంది. 2050 నాటికి రోబోలతో వివాహాలకు చాలా దేశాలు చట్ట బద్ధత కల్పించే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోబోల తయారీలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అబ్బాయిల కోసం అందగత్తెలను తలదన్నే రోబోలను తయారు చేస్తున్నారు. అలాగే అమ్మాయిల కోసం రాకుమారుల్లాంటి మరమనుషులును రూపొందిస్తున్నారు. రోబోలతో శృంగారం కూడా సేఫ్ అని, లైంగిక వ్యాధుల సమస్య ఉందటున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో భార్యాభర్తల నడుమ అసంతృప్తులు, తగాదాలు ఉండవని అంటున్నారు.
ఇవన్నీ బాగానే ఉన్నా... రోబోలు పిల్లలను పుట్టించే అవకాశం లేదు. భవిష్యత్తులో పిల్లలను పుట్టించే రోబోలను కూడా తయారు చేస్తారేమో శాస్త్రవేత్తలు! భగవంతుడి సృష్టికి ప్రతిసృష్టి చేయడం సాధ్యమేమో వేచి చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/