Begin typing your search above and press return to search.
సాధించిన చైనా..కరోనా వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ సక్సెస్
By: Tupaki Desk | 24 May 2020 1:30 PM GMTకరోనా వైరస్ ను పుట్టించిన చైనా ఇప్పుడు వ్యాక్సిన్ తయారీలోనూ ముందడుగు వేసింది. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా శ్రమిస్తుండగా చైనా ఏకంగా మనుషులపై ట్రయల్స్ వేసి దిగ్విజయంగా పూర్తి చేసింది. మనుషులపై వ్యాక్సిన్ బాగా పనిచేసిందని తెలిపి ఊరటనిచ్చింది.
వ్యాక్సిన్ వస్తేనే మానవ మనుగడ సాధ్యం కావడంతో ఇప్పుడు దాని తయారీపై ప్రపంచ దేశాలన్నీ విస్తృత పరిశోధనలు చేస్తున్నాయి. ఇక చైనాలో పుట్టిన ఈ వైరస్ కు వ్యాక్సిన్ తయారీలో చైనా వేగం పెంచింది. మొట్టమొదటి వ్యాక్సిన్ తొలిసారిగా మనుషులపై ట్రయల్స్ పూర్తి అయ్యాయని.. అద్భుతమైన ఫలితాలు సాధించినట్టు తెలిపింది. యూకేలోని మెడికల్ జర్నల్ ఈ చైనా తొలిదశ ఫలితాలకు సంబంధించిన నివేదినకు పబ్లిష్ చేసింది.
తొలి దశలో మనుషులపై చేసిన ట్రయల్స్ విజయవంతమయ్యాయని చైనా తెలిపింది. 108మంది వలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగించామని.. ఇది వైరస్ పై ఎలా పోరాడాలో వ్యాధినిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుందని వివరించింది.
వ్యాక్సిన్ తీసుకున్న మనుషుల్లో 28 రోజుల తరువాత కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్.. ప్రమాదకర లక్షణాలు కనిపించలేదని చైనా తెలిపింది. మనుషులు తట్టుకున్నారని.. రెండు వారాల తరువాత కరోనా వైరస్ కు యాంటీబాడీలు తయారయ్యాయని.. 28వ రోజున గరిష్ట స్థాయికి చేరుకున్నాయని తెలిపారు.
ఇక రెండోదశ క్లినికల్ ట్రయల్స్ ను 508 మంది వలంటీర్లతో తయారు చేస్తామని చైనీస్ అకాడమీ ఇంజినీరింగ్ తెలిపింది.