Begin typing your search above and press return to search.
సెక్యూరిటీ గార్డు..! అమానుష ప్రవర్తన.. ఛీ కొడుతున్న నెటిజన్లు..!
By: Tupaki Desk | 21 Feb 2021 7:30 AM GMTఆస్పత్రి వద్ద కాపలా కాయాల్సిన ఓ సెక్యూరిటీ గార్డు మానవత్వం మరిచిపోయాడు. వైద్యం కోసం వచ్చిన ఓ అభాగ్యురాలిపై దారుణంగా ప్రవర్తించాడు. సాటి మనిషి అన్న దయలేకుండా సదరు మహిళను ఈడ్చుకుంటూ లాక్కెళ్లి గేట్ బయట పడేశాడు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్గా మారింది. సదరు సెక్యూరిటీ గార్డు ప్రవర్తించిన తీరును అందరూ తప్పుపడుతున్నారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖార్గోన్ ప్రభుత్వాస్పత్రి వద్ద చోటుచేసుకున్నది.
ఇటీవల ఓ మహిళ తనకు చికిత్స చేయాలంటూ ఖార్గోన్ ప్రభుత్వాస్పత్రి కి వచ్చింది. తనకు మానసిక పరిస్థితి బాగాలేదని .. వైద్యం చేయాలని సదరు మహిళ వేడుకున్నది. అయితే ఆస్పత్రి వైద్యులు ఆమెకు చికిత్స చేసేందుకు నిరాకరించారు. అయినప్పటికీ ఆ మహిళ అక్కడే ఉండిపోయింది. దీంతో ఆస్పత్రి వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు ఆ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. మహిళను చేయి పట్టుకుని నేలపై నుంచి ఈడ్చుకెళ్లాడు.
మధ్యలో బురద ఉన్నా అలాగే లాక్కొనివెళ్లి ఆమెను గేట్ బయట పడేశాడు. ఈ ఘటనను కొందరు వీడియోతీసి సోషల్మీడియాలో షేర్ చేశారు.
సెక్యూరిటీ గార్డు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే సెక్యురిటీ గార్డును సస్పెండ్ చేశారు. అయితే ఆ సెక్యూరిటీ గార్డుకు అటువంటి ఆదేశాలు ఎవరు జారీచేశారో? వాళ్లపై కూడా చర్యలు తీసుకొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.