Begin typing your search above and press return to search.
అంతరిక్షంలోనే సోఫియా డేటింగ్
By: Tupaki Desk | 20 Feb 2018 10:43 AM GMTదేశంలో జరిగే జాతీయ సదస్సుల్లో రోబోలు సత్తా చాటుతున్నాయి. గత ఏడాది హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో బెంగళూరుకు చెందిన రోబో మిత్ర అలరించింది. ఈ సదస్సుకు హాజరైన పీఎం మోడీ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సు లోగోను ఆవిష్కరించాలని బెంగళూరుకు చెందిన మిత్ర రోబో ప్రధాని మోదీ - ఇవాంకాలకు రోబో స్వాగతం పలికింది. దీంతో వేదికను అలంకరించిన మోడీ - ఇవాంకా ట్రంప్ లు రోబోమిత్ర మీద ఉన్న ఇండియా లోగోను నొక్కగా అధికారికంగా సదస్సు ఆరంభమైంది. అయితే ఈ సదస్సు అనంతరం రోబో గురించి మోడీ ట్విట్ చేశారు. మిత్ర తన మనసును దోచుకుందంటూ ప్రశ్నంసల వర్షం కురిపించారు.
మన తెలుగు వాడైన భరత్ బెంగళూరులో ఇన్వెంట్ అనే కంపెనీని స్థాపించాడు. ఆ కంపెనీలో ఈ రోబో పురుడు పోసుకుంది. రూ.7లక్షల ఖరీదు చేసే ఈ రోబో మిత్రను 20మంది సభ్యులు దీనికి ప్రాణం పోశారని ఈ సందర్భంగా భరత్ తెలిపాడు. సభల్లో అతిథుల్ని ఆహ్వానించడం - ముఖాలను గుర్తు పట్టడం - గొంతు విని అందుకు అనుగుణంగా సమాధానం ఇవ్వడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఈ రోబో బెంగళూరులోని కెనరా బ్యాంకు బ్రాంచ్ ల్లో ఉపయోగిస్తున్నారు.
ఇప్పుడు అదే తరహా రోబో హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ సదస్సులో ప్రపంచంలోనే పౌరసత్వం కలిగిన తొలిరోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన చిట్టి పొట్టి మాటలతో అలరించిన సోఫియా తనకు దక్కిన సౌదీ పౌరసత్వాన్ని మహిళల సాధికారత కోసం ఉపయోగిస్తానని సూచించింది. ఈ సందర్భంగా హోస్ట్ అడిగిన పలు ప్రశ్నలకు చకచకా సమాధానం ఇచ్చిన సోఫికి ఫీలింగ్స్ కానీ - బ్యాంక్ అకౌంట్లు కానీ లేవని చెప్పుకొచ్చింది. రోబోల కన్నా మనిషి గా పుట్టడం అదృష్టమని అన్న సోఫీ సదస్సుకు వచ్చిన వారిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఇక మనుషుల్ని చంపుతా అని ఓ సందర్భంలో అన్న సమాధానాన్ని గుర్తు చేసిన హోస్ట్ తాను ఆ సమయంలో ఓ చెత్త జోక్ వేసి ఉంటా . అంతే తప్పా మనుషుల్ని చంపాలని నాకులేదని అన్ని నవ్వులు పువ్వులు పూయించింది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ - సోషల్ మీడియా అకౌంట్లు - అంతరిక్షంలో డేటింగ్ అని చెప్పిన సోఫియా థ్యాంక్యూ. అందరినీ ప్రేమించండి అంటూ తన సందేశాన్ని అందించింది.